రాత్రి వరకు అందరితో ఆనందంగా గడిపిన ఆ వ్యక్తి... తెల్లవారే సరికి శవమై కనిపించటంతో కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కమతంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన శంకర్... ఇంటి సమీపంలో చెట్టుకు వేలాడుతూ కనిపించడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆస్తి గొడవలతో బంధువులు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కదిరి గ్రామీణ పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. డీఎస్పీ భవ్య శ్రీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: