అనంతపురం జిల్లా యాడికి మండలం పులిప్రొద్దుటూరులో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి చనిపోగా.. కుమారుడికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రైతు రంగారెడ్డి(55) తన కుమారుడు నాగేంద్రారెడ్డితో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం తాడిపత్రికి బయల్దేరారు. పులిప్రొద్దుటూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ...ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా... నాగేంద్రారెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. భార్య వెంటే భర్త 'అనంత'లోకాలకు.. అనాథలైన చిన్నారులు