అనంతపురం జిల్లా మడకశిరలోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ఎదుట అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు. శుక్రవారం ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ ఉద్యోగికి కొవిడ్ ఆస్పత్రికి తరలించగా మిగిలిన ఉద్యోగులు హోం క్వారంటైన్ కు పరిమితమయ్యారు. దీంతో కార్యాలయం వద్ద స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించలేకపోయారు. కార్యాలయంలో హైపో క్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరిచిన అనంతరం ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని ఓ ఉద్యోగి తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయం ముందు ఎగరని జెండా - madakashira latest updates
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కాని పట్టణంలోని ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ముందు జెండా ఎగురవేయకపోవటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
![ప్రభుత్వ కార్యాలయం ముందు ఎగరని జెండా A flag hosting does not fly at governament office in madakashira](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8436205-585-8436205-1597540372545.jpg?imwidth=3840)
ప్రభుత్వ కార్యాలయం ముందు ఎగరని జెండా
అనంతపురం జిల్లా మడకశిరలోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ఎదుట అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు. శుక్రవారం ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ ఉద్యోగికి కొవిడ్ ఆస్పత్రికి తరలించగా మిగిలిన ఉద్యోగులు హోం క్వారంటైన్ కు పరిమితమయ్యారు. దీంతో కార్యాలయం వద్ద స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించలేకపోయారు. కార్యాలయంలో హైపో క్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరిచిన అనంతరం ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని ఓ ఉద్యోగి తెలిపారు.
ఇదీ చదవండి: మడకశిరలో హిందూ, ముస్లిం యువకుల రక్తదాన శిబిరం