ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలుగా చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని... అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. స్థానిక సర్కిల్లో తెలుగుదేశం, సీపీఐ నాయకులు సంతకాలు సేకరించారు. 13 జిల్లాల ప్రజలు అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు పోరాటం చేయాలని తెదేపా నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర్ నాయుడు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి...రైతు మృతితో రాజధాని గ్రామాల్లో కలకలం