Guntakal Double Murder Case Update: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఈ నెల 14న అత్యంత దారుణంగా చంపబడిన జంట హత్యల కేసులో 9 మంది నిందితులను గుంతకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో హేమ కోటిరెడ్డి, అతని డ్రైవర్ షేక్‌షాను.. వారి బంధువులైన భరత్ సింహారెడ్డి, సుబ్బరాయుడు, దేవేందర్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఆస్తి కోసం కుట్ర పన్ని మరో ఆరుగురితో కలిసి పథకం ప్రకారం వేశారు. అనుకున్న ప్రకారం అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇందులో భాగంగా పరారైన నిందితులను పోలీసులు పక్కా సమాచారంతో గుత్తి మండల పరిధిలోని బాట సుంకులమ్మ వద్ద అరెస్ట్ చేసి వారి నుండి హత్యకు ఉపయోగించిన పిడి బాకుతో పాటు రెండు కార్లు ఓ ద్విచక్ర వాహనం, కాల్చిన హార్డ్ డిస్క్ స్వాధీన పరచుకున్నారు.
ఆస్తి కోసం.. తమ్ముడు కుమారుడు: ఇందుకు సంబంధించి డీఎస్పీ నరసింగప్ప మీడియాకు హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హేమా కోటిరెడ్డి అతని డ్రైవర్ షేక్‌షాని చంపిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని వారు మూడు దశాబ్దాల కాలంగా ఆస్తి కోసం గొడవలు పడుతూనే ఉన్నారని పలుమార్లు కూడా హేమా కోటిరెడ్డిపై హత్యాయత్నం చేశారని వెల్లడించారు. అయితే అందులో అన్నదమ్ములు ముగ్గురు ఇదివరకే చనిపోవడంతో అతని తమ్ముడు కుమారుడైన భరత్ సింహా రెడ్డి మరో 8 మందితో కలిసి హత్యకు కుట్రపన్ని.. పథకం ప్రకారం మాటువేసి హేమ కోటిరెడ్డి ఇంటిలో ఉన్న సమయంలో ఇంటిలోనికి చొరబడి హేమా కోటిరెడ్డినీ.. అడ్డంగా వచ్చిన అతని డ్రైవర్ షేక్‌షాను కూడా అత్యంత కిరాతకంగా చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారని డీఎస్పీ నర్సింగప్ప వెల్లడించారు. అనంతరం అరెస్ట్ చేసిన నిందితులను కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండుకు పంపినట్లు తెలిపారు.
ఏలా జరిగింది: గుంతకల్లులో జంట హత్యలు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. దుండగులు ఇంట్లోకి చొరబడి ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. మాస్క్‌లతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కోటిరెడ్డిని కలవడానికి వచ్చారు. వారు ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టమని బెదిరించారనీ, కోటిరెడ్డి నిరాకరించడంతో వారి వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణ రహితంగా ఒక్కసారిగా దాడి చేశారు. అడ్డు వచ్చిన డ్రైవర్ షేక్‌షాను కూడా పొడిచారు. ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ షేక్‌షా తల్లి అదే ఇంటిలో వంట గదిలో ఉన్నట్లు గుర్తించిన నిందితులు.. ఆమెను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు చేశారు. అయితే, ఆమె వంటింటి తలుపులు వేసుకొని గట్టిగా అరవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఇవీ చదవండి