అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీలోని మహబూబ్నగర్ కాలనీలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఉదయాన్నే నిద్రలేచిన గొర్రెల కాపరి... గొర్రెలను చూసి లబోదిబోమన్నాడు. జీవనోపాధి కోసం తనతో పాటు మరో ఇద్దరు మిత్రులతో కలిసి గొర్రెలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నాడు. తమ బంధువులుకు అనారోగ్యంతో ఉండటంతో చూడటానికి వెళ్ళామని... తిరిగి రావడం అర్థరాత్రి కావడంతో అలసిపోయి నిద్రపోయామని వెల్లడించాడు.
గొర్రెలకు ఎవరూ కాపలా లేకపోవడంతో కుక్కలు ఇలా దాడికి యత్నించాయని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, 3 లక్షల రూపాయల వరకు నష్టపోయామని అన్నాడు. వైద్యులు చనిపోయిన గొర్రెలను పరిశీలించాక.. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: