అనంతపురం జేఎన్టీయూ 75 వసంతాల వజ్రోత్సవాల్లో భాగంగా 4కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, వీసీ రంగా జనార్ధన్ ప్రారంభించారు. టవర్ క్లాక్ నుంచి జేఎన్టీయూ వరకు 4-కె రన్ నిర్వహించారు. ఫిట్ జేఎన్టీయూ అనే నినాదంతో.. అధికారులు, విద్యార్థులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వజ్రోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించేందుకు.. ముందుగా 4-కె రన్ చేపట్టినట్లు వీసీ రంగా జనార్ధన్ తెలిపారు. మూడు రోజులపాటు వజ్రోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: BOMB THREAT TO TRAIN: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు..