ETV Bharat / state

మా గోడు వైసీపీ ప్రభుత్వానికి పట్టదా - అంగన్వాడీల ఆవేదన - వైసీపీ ప్రభుత్వం

Anganwadis Strike in Fulfill of Demands: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 17వ రోజు ఉద్ధృతంగా కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హమీలను నెరవేర్చకుంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ పోరు ఆగదని స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు అంగన్వాడీలు పోస్టుకార్డుల ద్వారా తమ డిమాండ్లను విన్నవించారు.

anganwadis_strike_in_fulfill_of_demands
anganwadis_strike_in_fulfill_of_demands
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 9:29 PM IST

Updated : Dec 28, 2023, 9:49 PM IST

17th day Anganwadi Strike: డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 17వ రోజు ఉద్ధృతంగా కొనసాగింది. పాదయాత్ర సమయంలో జగన్‌ ఇచ్చిన హామీలను ఉత్తరాలు రాసి గుర్తు చేశారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ పోరు ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.

Anganwadi Strike Tahsildar Office in Ananthapur: అనంతపురం జిల్లా శింగనమలలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దీక్షలు కొనసాగించారు. ఎమ్మిగనూరులో డప్పు కళాకారులు డప్పులు కొట్టి అంగన్వాడీల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఆలూరులో రోడ్డుపైనే బైఠాయించి అక్కడే భోజనాలు చేసి నిరసన తెలిపారు. పత్తికొండలో కంచాలు మోగిస్తూ ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం, చెన్నూరులో అంగన్వాడీల ఆందోళన కొనసాగింది. కడపలో మున్సిపల్‌ కార్మికులతో కలసి అంగన్వాడీలు చెవిలో పూలు పెట్టుకుని నిరనస తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు

Government Not Solve Anganwadi Problems: సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు నినాదాలు చేశారు. మాట ఇచ్చి మడమ తప్పిన సీఎం జగన్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదని ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్వాడీలు మండిపడ్డారు. జగన్ ఇచ్చిన హామీని ఆయనకు గుర్తు చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో అంగన్వాడీలు ఉత్తరాలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికేతర సమస్యలను పరిష్కరించి గొప్పలు చెప్పుకోవడం సరికాదని గుంటూరులో అంగన్వాడీలు నినదించారు. విజయవాడ ధర్నా చౌక్​లో నిర్వహించిన ధర్నాకు పెద్దసంఖ్యలో అంగన్వాడీలు హాజరయ్యారు.

అంగన్వాడీల అరెస్టు జగన్ నియంతృత్వానికి నిదర్శనం: లోకేశ్

Anganwadi Strike All Districts in AP: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేశారు. కాకినాడ జిల్లా తునిలో వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు సీఎం జగన్‌కు పోస్టుకార్డుల ద్వారా తమ డిమాండ్లను విన్నవించారు. విశాఖలో GVMC పార్కు వద్ద అంగన్వాడీల ఆందోళనకు తెదేపా నేతలు మద్దతు తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద ఉరితాళ్లు బిగించుకుని నిరనస తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట, నరసన్నపేట I.C.D.S ప్రాజెక్టు పరిధిలోని సిబ్బంది ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు రాసి నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీల ఆందోళనలు కొనసాగాయి.

అంగన్వాడీతో ప్రభుత్వం మళ్లీ చర్చలు - ఆ రెండు డిమాండ్లపై కార్యకర్తల పట్టు

Last Updated : Dec 28, 2023, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.