దసరా పండగ సందర్భంగా సంతకు వెళ్తుండగా ఆటో బోల్తా పడింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గరుడపల్లి వద్ద ఆటో బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చింతలపల్లి గ్రామానికి చెందిన నారా లక్ష్మన్న మృతి చెందారు. 14 మందికి గాయలయ్యాయి. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రయాణికులు చెప్తున్నారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరిలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి:'ఆటో బోల్తా... 8 మందికి తీవ్ర గాయాలు'