అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. జిల్లాలో తాజాగా 134 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 106 మంది అనంతపురం నగరానికి చెందిన వారే. నగరంలోని నాయక్నగర్, పాతూరు, ఓబులదేవరనగర్ల నుంచే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1823 మందికి మహమ్మారి సోకగా... వీరిలో తొమ్మిది మంది మృతి చెందారు. 731 మంది కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 845 కరోనా కేసులు.. ఐదుగురు మృతి