- Fire Accident: పండుగవేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు
Fire Accident: దీపావళి పండుగవేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు కారణాలతో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదంతో 25 బైకులు, సామగ్రి కాలి బూడిదయ్యాయి. కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ అగ్నిప్రమాదాలు సంభవించాయి.
- Solar eclipse: ఇవాళ సూర్యగ్రహణం... ప్రధాన ఆలయాల మూసివేత
Solar eclipse: సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సహా పలు దేవాలయాలు మూతపడ్డాయి. ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7.30 తర్వాత సర్వదర్శన భక్తులను అనుమతిస్తారు. సూర్యగ్రహణం కారణంగా తితిదే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
- Diwali celebrations: ఇంటింటా దీపాల కాంతులు.. అంబరాన్నంటిన సంబరాలు
Diwali celebrations: వెలుగుల పండుగ దీపావళిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దీపాలతో ఇళ్లను అందంగా అలంకరించి లక్ష్మీదేవికి పూజలు చేశారు. బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని ఆనందం పంచుకున్నారు.
- సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన దీపావళి బాధితులు...
Sarojini Devi eye hospital: దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చుతూ పలువురు ప్రమాదానికి గురయ్యారు. బాధితులు హైదరాబాద్‌లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి వరుసకట్టారు. మొత్తం 24 మంది గాయపడ్డారని.. వారికి చికిత్స అందించినట్లు సరోజినీదేవీ కంటి ఆసుపత్రి వైద్యురాలు వసంత తెలిపారు.
- బాణసంచా నిషేధం బేఖాతరు.. దిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత
దిల్లీలో వాయు నాణ్యత మరింత పడిపోయింది. బాణసంచాపై ఉన్న నిషేధాన్ని దిల్లీవాసులు లెక్కచేయలేదు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత అతితీవ్ర స్థాయికి చేరింది. అయితే, గత నాలుగేళ్లతో పోలిస్తే దీపావళి తర్వాత వాయుకాలుష్యం ఈసారి తక్కువగానే ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.
- చోరీకి వచ్చి ఇంట్లోని దేవుడి గదిలో ఉరేసుకున్న దొంగ.. నిజంగా ఆత్మహత్యేనా?
ఓ టెకీ ఇంటిలోకి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అయితే దొంగ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే దీని వెనక హత్య కోణం ఏదైనా ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- బస్సులో మంటలు చెలరేగి నిద్రలోనే డ్రైవర్ కండక్టర్ సజీవదహనం
ఝార్ఖండ్ రాంచీలోని ఖాడ్గఢ్ బస్టాండ్‌లో ఘోరం జరిగింది. దేవునికి పెట్టిన దీపం అంటుకుని బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులో నిద్రిస్తున్న డ్రైవర్ మదన్, కండక్టర్ ఇబ్రహీం సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో పూర్తిగా కాలిపోయిన రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన మంగళవారం వేకువజామున ఒంటిగంటకు జరిగిందని అధికారులు తెలిపారు.
- అమెరికాలో అట్టహాసంగా దీపావళి వేడుకలు.. వారికి బైడెన్, కమల ధన్యవాదాలు
అమెరికాలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్వేతసౌధంలో నిర్వహించిన దీపావళి వేడుకలకు హాజరైన అధ్యక్షుడు జో బైడెన్.. మనలో చీకటిని పారదోలి వెలుగు ఇచ్చే శక్తి పండుగలకు ఉందని ఉద్ఘాటించారు. దీపావళి అమెరికా సంస్కృతిలో భాగంగా మారిందన్న కమలా హారిస్... అందుకు ప్రవాస భారతీయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- T20 worldcup: టీమ్ఇండియాకు తప్పిన టెన్షన్.. అలా చేస్తే సెమీస్ బెర్త్ ఖాయం!
జింబాబ్వేపై సులువుగా గెలవాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరింది. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడం సౌతాఫ్రికాకు ఇబ్బందికరంగా మారనుండగా.. భారత్‌కు మాత్రం కలిసొచ్చింది. ఎలా అంటే?
- దీపావళి స్పెషల్ ఫొటోషూట్‌తో అందాల తారల తళుకులు
సోమవారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు హీరోయిన్లు తమ కుటుంబాలతో కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ పండగ స్పెషల్ ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఫొటోలను ఓ సారి చూసేద్దాం.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news
..
ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM