అనంతపురం జిల్లా విడపనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 119 గోవా మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద సోమవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టగా.. బళ్లారి నుంచి వస్తున్న బస్సులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. ఈ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఓ మహిళను అరెస్టు చేశారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి రిమండ్కు తరలించారు. బస్సులో లేదా ఏ ఇతర వాహనాల్లో అక్రమంగా మద్యం తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విడపనకల్ ఎస్సై గోపి హెచ్చరించారు.
ఇదీ చదవండి: సీసీపీడబ్ల్యూసీతో సైబర్ నేరాల నియంత్రణ: డీజీపీ