ETV Bharat / state

బీసీలకు ప్రత్యేక చట్టం - అందరికీ అండగా ఉంటాం : నారా లోకేశ్ - Nara Lokesh news

Yuvagalam Padayatra Updates: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు ప్రత్యేక చట్టం చేసి, వారి రక్షణకు అండగా ఉంటామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఏటా డీఎస్సీ, మెగా డీఎస్సీ వేస్తామని జగన్‌ హామీలిచ్చి మరిచారని లోకేశ్ ధ్వజమెత్తారు. కల్తీ మద్యం, గంజాయి, అక్రమ కేసులతో యువత భవితను జగన్​ నాశనం చేశారని దుయ్యబట్టారు.

yuvagalam_padayatra_updates
yuvagalam_padayatra_updates
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 5:26 PM IST

Yuvagalam Padayatra Updates: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. నేటి (221వ రోజు) పాదయాత్రను యువనేత లోకేశ్ నక్కపల్లి కృష్ణగోకులం లేఔట్‌ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు.

Lokesh Anakapalli Padayatra Updates: టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రకు అనకాపల్లి జిల్లా ప్రజలు, యువత, మహిళల నుంచి భారీ స్పందన లభిస్తోంది. వేలాది మంది మహిళలు, విద్యార్థులు లోకేశ్‌‌ను చూడడానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్థానికుల సమస్యలు, వినతిపత్రాలను స్వీకరిస్తూ యువనేత లోకేశ్ ముందుకు సాగుతున్నారు. మరో 3 నెలల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు అందరి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వారికి భరోసానిచ్చారు.

విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు - ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి: నారా లోకేశ్

Lokesh Face to Face with BC Members: నేటి పాదయాత్రలో నారా లోకేశ్ పెనుగొల్లులో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో వారికి జరిగిన అన్యాయాలను యువనేతకు వివరించారు. నిరుద్యోగుల విషయంలో సీఎం జగన్ ఏటా డీఎస్సీ, మెగా డీఎస్సీలు వేస్తామని హామీలిచ్చి, యువతను దారుణంగా మోసం చేశారని వాపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీ 'డి' వారిని బీసీ 'ఎ'లోకి మార్చాలని లోకేశ్‌ను కోరారు.

Nara Lokesh Comments: ''వైఎస్ జగన్ ఎన్నికల ముందు హామీలు మీద హామీలిచ్చారు. అధికారం చేపట్టాక నిరుద్యోగంలో రాష్ట్రాన్ని నెం.1 చేశారు. ఏటా డీఎస్సీ, మెగా డీఎస్సీల హామీని జగన్‌ ఎప్పుడో మరిచారు. జగన్ యువతకు చేసిందల్లా కల్తీ మద్యం, గంజాయి అందించారు. అక్రమ కేసులతో యువత భవిత నాశనం చేశారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పి, నాలుగేళ్లయినా ఇప్పటివరకూ ఒక్క జాబ్‌ ఇవ్వలేదు. డీఎస్సీ, మెగా డీఎస్సీ అంటూ మోసానికి తెర తీశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు ప్రత్యేక చట్టం చేసి, వారి రక్షణకు అండగా ఉంటాం'' అని నారా లోకేశ్ అన్నారు.

మూడు నెలల్లో ప్రజా ప్రభుత్వం వస్తుంది - మీ అందరి కన్నీళ్లు తుడుస్తాం : నారా లోకేశ్

Lokesh on SC Illegal Cases: పులివెందులలో ఎస్సీ మహిళపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారని లోకేశ్ ఆవేదన చెందారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఎస్సీలపైనే వైఎస్ జగన్ ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోందని ఆగ్రహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అక్రమ కేసులు ఎత్తివేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే, హామీలు నెరవేరుస్తామన్నారు. బీసీలకు తగ్గించిన రిజర్వేషన్లను పెంచుతామన్నారు. బీసీ సోదరులకు అండగా నిలబడే ఏకైక పార్టీ టీడీపీనేనని యువనేత నారా లోకేశ్ మరోసారి ఉద్ఘాంటించారు.

పోలేపల్లిలో యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ - హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.