Road accident in Anakapalli: అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద బైక్పై వెళ్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బండిపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. "కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తరుణ్ బాబు, సింగిరెడ్డి దినేశ్, రావాడ లోకేశ్ లు.. అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు కాలేజ్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. బైక్పై నర్సీపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా.. మాకవరపాలెం మండలం రాచపల్లిలోని కామేశ్వరమ్మ గుడి వద్ద ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తరుణ్ బాబు అక్కడిక్కక్కడే మృతి చెందగా, సింగిరెడ్డి దినేష్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లగా, మరో విద్యార్థి రాకేశ్ స్వల్ప గాయాలతో చికిత్స తీసుకుంటున్నాడు" అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి