ETV Bharat / state

అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు కలకలం.. 300 మంది మహిళా కార్మికులకు అస్వస్థత - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు

POISON GAS
అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ యూనిట్‌లో ఘాటైన వాయువు
author img

By

Published : Jun 3, 2022, 1:00 PM IST

Updated : Jun 4, 2022, 5:16 AM IST

12:55 June 03

అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు కలకలం.. 300 మంది మహిళా కార్మికులకు అస్వస్థత

అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ యూనిట్‌లో ఘాటైన వాయువు

ammonia leakage : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోని సీడ్స్‌ వస్త్రపరిశ్రమల నుంచి వెలువడిన ప్రమాదకరమైన విషవాయువు వల్ల 300 మంది ఉద్యోగినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో రెండు గంటల్లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు గాఢమైన విషవాయువు విడుదలైంది. దీంతో మహిళా కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కంపెనీలో పనిచేస్తున్న వారికి ఊపిరి అందకపోవడంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. బయట వాతావరణంలో వాయువు మరింత వ్యాపించి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో కంపెనీ ప్రతినిధుల సూచన మేరకు లోపలికి వెళ్లిపోయారు. అక్కడ ఒక్కొక్కరు వాంతులు చేసుకుంటూ కింద పడిపోయారు. కొందరు స్పృహ తప్పిపోవడంతో కంపెనీలో ప్రాథమిక చికిత్స అందించారు. ఏ-షిఫ్ట్‌కు హాజరైన 2వేల మందిలో ఎక్కువమంది ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. బాధితులను కంపెనీ అంబులెన్సులు, ఇతర వాహనాల్లో తొలుత అచ్యుతాపురానికి తరలించారు. అక్కడి ఆసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక ఉద్యోగినులు ప్రత్యక్ష నరకం అనుభవించారు. 12 గంటలకు ప్రమాదం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు చికిత్స అందించడానికి అచ్యుతాపురానికి ఒక్క వైద్యుడినీ పంపలేదు. రోడ్లమీద, మెట్ల మీద, కటిక నేలపైనా బాధితులు స్పృహతప్పి పడిపోతూ వైద్యసేవల కోసం ఆర్తనాదాలు చేస్తూ కనిపించారు. ఈ ప్రమాదంలో ఏడు నెలల గర్భిణులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వీరి చికిత్సల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లేవీ చేయకపోవడంపై పలువురు మండిపడ్డారు. ప్రమాదం జరిగిన 4గంటల తరువాత 120 మంది బాధితులను అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని అనకాపల్లిలోనే వివిధ ప్రైవేటు ఆసుపత్రిల్లో చేర్చారు. జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా ఎస్పీ గౌతమి సాలి వచ్చి విత్తన కంపెనీని పరిశీలించారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటో ప్రకటించలేదు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబురాజు) రాత్రి 7గంటల తర్వాత కంపెనీని సందర్శించి ప్రమాద కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, పర్యటనకు ఓ మీడియా ప్రతినిధులను తప్ప మిగిలిన వారిని ఎవ్వరినీ అనుమతించలేదు.

.

ఎక్కడి నుంచి వచ్చింది?

విషవాయువు ఎక్కడినుంచి వచ్చింది, ఎక్కడకు వ్యాపించిందనే విషయాలను అధికారులు ఇప్పటికీ స్పష్టంగా చెప్పడం లేదు. బ్రాండిక్స్‌ అప్పెరల్‌ సిటీలోని సీడ్స్‌ వస్త్రపరిశ్రమలోనే బాధితులు ఎక్కువగా ఉన్నా, పక్కనే ఉన్న పోరస్‌ నుంచి అమ్మోనియా లీకైందని మంత్రి అమర్‌నాథ్‌ అంటున్నారు. పీసీబీ అధికారులు, ఇతర అధికార వర్గాల నుంచి మాత్రం దీనిపై కచ్చితమైన సమాచారం లేదు.

.

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంలాగే..: అచ్యుతాపురం విషవాయువు ప్రమాదం రెండేళ్ల క్రితం విశాఖలో జరిగిన ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రమాదాన్ని గుర్తుచేసింది. అప్పటి ప్రమాదంలో బాధితులు రోడ్డుమీదకు వచ్చి కుప్పకూలినట్లే.. ఇక్కడా మహిళా కార్మికులు పడిపోయారు. మండలకేంద్రంలో ఉద్యోగినులు వందల సంఖ్యలో కుప్పకూలిపోవడం చూసి స్థానికులు ఆందోళన చెందారు. విషవాయువు ప్రభావం సెజ్‌ నుంచి 12 కిలోమీటర్ల వరకు కనిపించింది. శుక్రవారం మధ్యాహ్నం భరించలేని వాసనలతో ఇబ్బంది పడ్డామని మండలంలో పెదపాడుకు చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. అచ్యుతాపురంలో ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

.

బాధితులకు మెరుగైన వైద్యం: సీఎం

ఈనాడు, అమరావతి: అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌, వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలకు అస్వస్థత ఘటనకు సంబంధించిన వివరాల్ని సీఎం జగన్‌ అధికారుల నుంచి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణాలేంటో దర్యాప్తు చేసి, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా ప్రత్యేకదృష్టి సారించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అస్వస్థతకు గురై అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కార్మికులను శుక్రవారం సాయంత్రం ఆయన పరామర్శించారు.

ప్రభుత్వ వైఫల్యంతోనే..: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ వైఫల్యం, సంబంధిత శాఖల పర్యవేక్షణ లోపంతోనే అచ్యుతాపురం గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ‘అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని పోరస్‌ కంపెనీలో విషవాయువులు విడుదలై సమీపంలోని వస్త్రపరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగించింది’ అని చంద్రబాబు అన్నారు.

ప్రభుత్వానిదే బాధ్యత: సోము వీర్రాజు

అచ్యుతాపురం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండు చేశారు. ‘రసాయన పారిశ్రామిక సంస్థల్లో జరుగుతున్న ప్రమాదాల వల్ల ప్రజలు, కార్మికులకు రక్షణ కొరవడుతోంది’ అని విమర్శించారు.

కోలుకోవాలి గానీ పరిహారంతో పనేంటి?

మంత్రి తీరుపై కార్మిక సంఘాల ఆవేదన

.

ఎలమంచిలి, అచ్యుతాపురం, న్యూస్‌టుడే: విషవాయువు ప్రభావంతో మహిళా కార్మికులు అస్వస్థతకు గురైన ఘటనలో బాధితులకు పరిహారం చెల్లింపుపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సమాధానం దాటవేశారు. శుక్రవారం సాయంత్రం అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం చోటుచేసుకున్న కంపెనీ వద్దకు వచ్చిన మంత్రిని బాధితులకు పరిహారం, వైద్యసేవలు, ఆర్థిక సాయంపై స్థానికులు, కార్మిక సంఘాల నాయకులు అడిగారు. బాధితులు ఆరోగ్యంగా కోలుకోవాలి గానీ పరిహారంతో పనేంటేని మంత్రి తిరిగి వారిని ప్రశ్నించారు. మహిళా కార్మికులు కోలుకున్నా భవిష్యత్తులో వారి ఆరోగ్యాలపై ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయోనని కార్మికసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేసినా మంత్రి స్పందించలేదు. 300 మంది పేద మహిళలు అనారోగ్యానికి గురైనా వారికి సాయంపై పట్టించుకోలేదని కార్మికసంఘాల నాయకులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 4, 2022, 5:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.