Expatriates Protest: అనకాపల్లి జిల్లా రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో సుమారు 4,500 ఎకరాల్లో నిర్మిస్తున్న నావిక స్థావరం ప్రాజెక్టు నిర్వాసితులు నేవీ ప్రధాన ద్వారం వద్ద ఈరోజు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. నిర్వాసితులు తమ డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన ధర్నాలో ఎనిమిది గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఏడు గంటలకే ఆందోళనకారులు నేవీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని బైఠాయించారు. నేవీ ప్రాజెక్టులోకి ఎలాంటి వాహనాలు వెళ్లకుండా రహదారిపై నిలిచిపోయాయి. ధర్నా వద్ద భారీ స్థాయిలో పోలీసు బలగాలు మోహరించారు.
ఇవీ చదవండి: