ETV Bharat / state

AMMONIA GAS: ఈ ముప్పు ఎవరి తప్పిదం?..36 గంటలు దాటినా కారణాలపై అస్పష్టతే - అనకాపల్లి జిల్లా తాాజా వార్తలు

AMMONIA GAS: అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ‘సీడ్స్‌’ వస్త్ర పరిశ్రమలో వందలమంది మహిళా కార్మికుల అస్వస్థతకు కారణమైన విషవాయువు ఎక్కడ నుంచి విడుదలైందో 36 గంటల తరువాత కూడా అధికారులు తేల్చలేకపోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విశాఖ పీసీబీ అధికారులు సమీపంలోని ఒక ప్రైవేటు కంపెనీ నుంచి అమ్మోనియా విడుదలైందని, సీడ్స్‌ కంపెనీకి చెందిన ఏసీ బ్లోయర్స్‌ దానిని లాక్కోవడంతో కార్మికులు అస్వస్థతకు గురయ్యారని ప్రకటించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ కోసం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఓ కమిటీని నియమించింది. వారంలో నివేదిక సమర్పించాలని పీసీబీ సభ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌ ఆదేశించారు.

AMMONIA GAS
ఈ ముప్పు ఎవరి తప్పిదం?..36 గంటలు దాటినా కారణాలపై అస్పష్టతే
author img

By

Published : Jun 5, 2022, 7:07 AM IST

AMMONIA GAS: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ‘సీడ్స్‌’ వస్త్ర పరిశ్రమలో వందలమంది మహిళా కార్మికుల అస్వస్థతకు కారణమైన విషవాయువు ఎక్కడ నుంచి విడుదలైందో 36 గంటల తరువాత కూడా అధికారులు తేల్చలేకపోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విశాఖ పీసీబీ అధికారులు సమీపంలోని ఒక ప్రైవేటు కంపెనీ నుంచి అమ్మోనియా విడుదలైందని, సీడ్స్‌ కంపెనీకి చెందిన ఏసీ బ్లోయర్స్‌ దానిని లాక్కోవడంతో కార్మికులు అస్వస్థతకు గురయ్యారని ప్రకటించారు. ఆ కంపెనీలోనే గ్యాస్‌ లీకైందని ఒకసారి, సమీపంలో ఉన్న సీఈటీ ప్లాంటు నుంచి విడుదలైందంటూ మరోసారి ప్రకటనలు ఇచ్చారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ కూడా సమీపంలో ఉన్న కంపెనీ నుంచే విషవాయువు లీకలైందని తొలుత ప్రకటించి.. తరువాత కాదని పేర్కొన్నారు. శనివారం కూడా దర్యాప్తు కొనసాగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణాలు.. విషవాయువు ఎక్కడ నుంచి విడుదలైంది.. మహిళా కార్మికులు పడిన ఇబ్బందులను తెలుసుకోవడానికి నక్కపల్లి సీఐ నారాయణరావు ఆ పరిశ్రమ ఆవరణలో పరిశీలించారు. సీసీ కెమెరాల నుంచి ఫుటేజీ తీసుకున్నారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ కోసం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఓ కమిటీని నియమించింది. వారంలో నివేదిక సమర్పించాలని పీసీబీ సభ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌ ఆదేశించారు.

పీసీబీ అధికారుల రహస్య పర్యటన..
ప్రమాదం జరిగి 36 గంటలు దాటినా మంత్రి అమర్‌నాథ్‌ ప్రకటించిన కమిటీలోని జేసీ, పీసీబీ ఈఈ, పరిశ్రమలశాఖ ఇన్‌స్పెక్టర్‌, ఏఎస్పీ ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి రాలేదు. పీసీబీ జోనల్‌ అధికారులు మాత్రం శనివారం రహస్యంగా పర్యటించారు. 180 వరకు రసాయన పరిశ్రమలున్న ఈ సెజ్‌లో ఏ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైందో తెలుసుకోలేని దుస్థితిలో పీసీబీ అధికారులు ఉండరని, నేతల జోక్యం వల్లనే రహస్యంగా ఉంచుతున్నారేమో అని కార్మికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

కోలుకుంటున్న మహిళా కార్మికులు
ప్రమాదంలో అస్వస్థతకు గురైన మహిళా కార్మికులు కోలుకుంటున్నారు. అనకాపల్లిలోని జిల్లా ఆసుపత్రి సహా వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో మొత్తం 312 మంది కార్మికులను చేర్చగా ఇప్పటివరకు 194 మంది డిశ్ఛార్జ్‌ అయ్యారు. 118 మంది చికిత్స పొందుతున్నారు.

అసమర్థత వల్లే ప్రమాదాలు
‘కాలుష్య నియంత్రణ మండలి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారుల అసమర్థత వల్లే పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలు బలైపోతున్నాయని ‘సైంటిస్ట్‌ ఫర్‌ పీపుల్‌’ ప్రతినిధుల బృందం ఆరోపించింది. పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలపై పర్యవేక్షణ ఉండట్లేదని పేర్కొంది. గత ప్రమాదాలకు సంబంధించిన విచారణ నివేదికల్ని సైతం రహస్యంగా ఉంచుతున్నారని, వీటన్నింటి ఫలితంగానే వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఈ సంస్థకు చెందిన డా.కె.బాబురావు, డా.కె.వెంకటరెడ్డి, ప్రొఫెసర్‌ కె.విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. కార్మికులు అమ్మోనియా వాయువు పీల్చటం వల్లే అస్వస్థతకు గురయ్యారంటూ అధికారులు ఎలా నిర్ధారణకొచ్చారో చెప్పాలన్నారు. ‘అమ్మోనియా పీలిస్తే కనిపించే లక్షణాలేవీ ఇక్కడి బాధితుల్లో కనిపించలేదు. నిజంగానే అమ్మోనియా విడుదలై ఉంటే బయోమేకర్‌ మెటబాలిటీస్‌ ద్వారా గుర్తించొచ్చు. దాన్ని చేశారా? లేదా? అనేది స్పష్టత లేదు. ఇవేమీ లేకుండా అమ్మోనియా అంటూ ఎలా చెబుతారు? ఏ పరిశ్రమ నుంచి వాయువు లీకయిందనేది ఇప్పటివరకూ తేల్చలేదు. పరిశ్రమలపై అధికారులకు నియంత్రణ లేదని అర్థమవుతోంది’ అని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.