Minister Amarnath on Gas leak incident: అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీకైన ఘటనలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భోజన విరామ సమయంలో వాయువు వెలువడిందని కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయినట్టు బాధితులు చెబుతున్నారు. బ్రేక్ సమయంలో ఘటన జరిగిందని తెలిపారు.
Atchutapuram SEZ: అచ్యుతాపురం సీడ్స్ కంపెనీ బాధితులకు అనకాపల్లి జిల్లాల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆస్పత్రిలో 56 మంది, ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో 38 మంది, విశాఖలోని మెడికేర్ ఆస్పత్రిలో మరో కార్మికురాలికి చికిత్స అందిస్తున్నారు. మహిళా కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత ఘటన మొదటిది కాదన్న ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు.. గతంలో జరిగిన ప్రమాదాలపై తయారు చేసిన నివేదికను ఎందుకు బహిర్గత పరచలేదని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్న నేతలు వరుస ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో బాధితులను పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ పరామర్శించారు. సీడ్స్ కంపెనీ మూసేయాలని ఆదేశించినట్లు తెలిపారు. తప్పు జరిగితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనని.. ఇదే కంపెనీలో అంతకుముందు కూడా జరిగిందని వివరించారు. ఏసీ డెక్‌లలో క్రిమిసంహారక మందులు కలవడం వల్ల జరిగిందని.. ఆ ఘటనలో గ్లోరిఫై పాలీస్ అనే రసాయనం వెలువడినట్లు తెలిసిందని వెల్లడించారు. ఈసారి దేనివల్ల ప్రమాదం జరిగిందో నిర్ధారణ కావాల్సి ఉందని పేర్కొన్నారు. యాదృచ్ఛికమా లేదా ఉద్దేశపూర్వక చర్యా అనేది తేలాల్సి ఉందని తెలిపారు.
ఇవీ చదవండి: