ETV Bharat / state

విశాఖ మెట్రోకు.. '4100 కోట్లు ఇస్తాం'! - metro md

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడనుంది. నిర్మాణేతర పనులకు 4 వేల 100 కోట్ల రూపాయల రుణం సమకూర్చేందుకు కొరియాకు చెందిన ఎగ్జిం బ్యాంకు ముందుకొచ్చింది.

అమరావతి
author img

By

Published : Mar 6, 2019, 5:54 PM IST

విశాఖ మెట్రోపై ప్రతినిధుల సమావేశం
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. కొరియాకు చెందిన ఎగ్జిం బ్యాంకుప్రతినిధుల బృందం ప్రాజెక్టు ఎండీ రామకృష్ణా రెడ్డితో సమావేశమైంది.నిర్మాణేతర పనుల కోసం 4 వేల 100 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు బ్యాంకు ముందుకొచ్చింది. రుణ మంజూరుపై విధివిధానాల గురించి చర్చించి అవగాహనకు రావాలని సమావేశంలో నిర్ణయించారు.

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం 42.5 కిలోమీటర్లు పొడవునా.. 3 కారిడార్లలో నిర్మించనున్నారు. 4200 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టేందుకు 5 సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. మెట్రో పనులకు గురువారం టెండర్లు దాఖలు చేసే సంస్థల్లో.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూర్చే సంస్థను ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొరియాకు చెందిన ఎగ్జిం బ్యాంకు రుణం అధికారికంగా ఖరారైన వెంటనే... పనులను ప్రారంభించాలని భావిస్తున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.