ETV Bharat / state

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రవాహానికి ఎదురీత.. పట్టుతప్పితే..! - అల్లూరి జిల్లా తాజా వార్తలు

PROBLEMS: చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించాడానికి వెళ్లేటప్పుడు మాములుగా ఉన్న వరద ఉద్ధృతి.. తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదకరంగా మారింది. గ్రామం లోపలికి రావాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దాటాల్సిన పరిస్థితి. వాగు దాటడానికి మరో మార్గం లేక ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటూ అత్యంత ప్రమాదకరమైన ప్రవాహాన్ని దాటుకుని ఒడ్డుకు చేరారు.

PROBLEMS
ప్రవాహానికి ఎదురీత
author img

By

Published : Jul 13, 2022, 7:55 PM IST

ప్రవాహానికి ఎదురీత

PROBLEMS: భారీ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొండ వాగు ఉద్ధృతి పెరిగింది. పాడేరు మండలంలోని కించూరులో ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకెళ్లి.. తిరిగి వచ్చే క్రమంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో గ్రామం వెలుపలకు వచ్చేందుకు ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. మరో మార్గం లేక ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటూ అత్యంత ప్రమాదకరమైన ప్రవాహాన్ని దాటుకుని ఒడ్డుకు చేరారు.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పెదబయలు మండలం గుంజివాడ-జామిగుడ గ్రామాల మధ్యలో ఉన్న కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గ్రామాలు దాటడానికి గిరిజనులు ప్రవాహాలకు ఎదురీదుతూ గమ్యానికి చేరుతున్నారు. వంతెనలు లేకపోవడం వల్ల.. వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి సాహసాలు చేయాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్లూరి జిల్లాలోని ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం-బుంగపుట్ పంచాయతీల మార్గంమధ్యలో గల ముంతగిమ్మి, బిరిగుడ, కోజిరిగుడ గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. వరదల ప్రభావం 21 గ్రామాల గిరిజనుల రాకపోకలపై చూపుతోంది. బుధవారం బడు లక్ష్మీపురం వారపు సంతకు అత్యవసర సామగ్రి కోసం గిరిజనులు డిప్పాల్ సహాయంతో గెడ్డలు దాటి వచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.