Oil Factory Accident : ఆయిల్ ప్రమాదంలో మృత్యువాత పడిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. మృతి చెందిన వారిలో అల్లూరి సీతరామరాజు జిల్లా పెదబయలు మండలానికి చెందిన వారి మృత దేహాలను స్వగ్రామాలకు తరలించారు. శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం గ్రామానికి తీసుకు రాగా.. శుక్రవారం అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతులలో లక్షీపురం గ్రామానికి చెందిన వెచ్చంగి సాగర్, వెచ్చంగి కృష్ణారావు, వెచ్చంగి నరసింహ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి మరణంతో గ్రామంలో విషాధ చాయాలు అలుముకున్నాయి. పాడేరు జాయింట్ కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రావాల్సిన పరిహారాన్ని వీలైనంత తొందరగా ఇప్పిస్తానని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే : కాకినాడ జిల్లాలోని.. అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు బలయ్యారు. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ ఆవరణలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ ట్యాంకర్.. శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు ఒకరి తర్వాత ఒకరు లోపలికి దిగారు. అందులో ఊపిరాడక అందరూ మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఐదుగురిని పాడేరు వాసులుగా,. ఇద్దరిని పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో పాడేరు వాసులుగా.. వెచ్చంగి కృష్ణ, వెచ్చంగి నరసింహ, సాగర్, కె.బంజుబాబు, కుర్రా రామారావు.. పులిమేరుకు చెందినవారిగా కట్టమూరి జగదీశ్, ప్రసాద్లను గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ప్రమాదంపై ఆరా తీశారు.
ఇవీ చదవండి :