ETV Bharat / state

ఉప్పొంగిన వాగులు, విరిగిన కొండచరియలు - నిలిచిన వాహన రాకపోకలు

Michaung Cyclone in Alluri Sitaramaraju District : మిగ్​జాం తుపాను కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో ఒకవైపు గెడ్డలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో వైపు కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రాకపోకలు స్తంభించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా పంట నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.

michaung_cyclone_in_alluri
michaung_cyclone_in_alluri
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 4:42 PM IST

ఉప్పొంగిన వాగులు, విరిగిన కొండచరియలు - నిలిచిన వాహన రాకపోకలు

Michaung Cyclone in Alluri Sitaramaraju District : జిల్లాలోని పాడేరు శివారు చిలకలమామిడిగెడ్డ ఉద్ధృతిగా ప్రవహిస్తుంది. దీంతో పాడేరు నుంచి హుకుంపేటకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హుకుంపేట మండలంలో అడ్డుమండ వద్ద వంతెన పైనుంచి వరద నీరు ప్రవాహిస్తుంది. పరదానిపుట్టు వంతెనపై వరద నీరు నిలవడం వల్ల సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలగడం వల్ల ఉద్యోగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారి అవస్థలు వర్ణతీతం. జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగి పడడం వల్ల రహదారులతో పాటు రైలు మార్గాలకు కూడా అంతరాయం ఏర్పడింది. జిల్లా నుంచి విశాఖ రహదారి మార్గంలో బండరాళ్లు రోడ్డు మీదకు జారిపడటం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బొర్రా గుహలకు వెళ్లే మార్గంలో కొండచరియల విరిగి పడి చిన్నచిన్న మట్టి రాళ్లు వాహనాలకు ఆటంకం మారాయి. వాటిని ఒకవైపు తొలగిస్తు ఉన్న మరో వైపు ఇంకా జారీ పడడం వల్ల రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వర్షం కారణంగా వాటిని తొలిగించేందుకు ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు.

వరి రైతు వెన్నువిరిచిన 'మిగ్​జాం' - నిండా మునిగి దిక్కుతోచని స్థితిలో అన్నదాత

Reservoirs have Become Full : జిల్లాలోని రంపచోడవరం మన్యంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భూపతిపాలెం, ముసురుపల్లి, సూరంపాలెం, మద్దిగడ్డ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. భూపతిపాలెం జలాశయంలోని భారీగా వరద నీరు వచ్చి చేరడం వల్ల దిగువన ఉన్నా సీతపల్లి వాగులోకి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో సీతపల్లి వాగు ఉద్ధృతింగా ప్రవహించి రంప వంతెనను ముంచెత్తింది. దీంతో రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం మండల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే రహదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. వీటిని తొలగించేందుకు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి సూరజ్​ గనోరే, సబ్​ కలెక్టర్లు శుభం బన్సల్​ సహాయక చర్యలు చేపట్టారు.

రైతులను కష్టాల కొలిమిలోకి నెట్టిన మిగ్​జాం - ఆరుగాలం పండించిన పంట వర్షార్పణం

Streams Overflow : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఒకవైపు వాగులు, గెడ్డలు ఉప్పోంగి ఉద్ధృతంగా ప్రవహిస్తుంటే మరోవైపు మారుమూల ప్రాంతాల్లో ఉన్న రైతులకు తుపాను సంబంధించిన సమాచారం తెలియక చేతికి వచ్చిన వరి పంటను కోసుకొలేకపోయారు. మరికొన్ని చోట్ల కోసిన వరి పనలు గెడ్డల్లో కొట్టుకుపోయాయి. చేతికి అందిన పంట తుపాను తాకిడి కొట్టుకుపోవడం వల్ల రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వాలు చెక్​ డ్యాం నిర్మించలేని దుస్థితిలో ఉండడం వల్లనే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో తమ పంటను అంచన వేసి నష్ట పరిహరం చెల్లించవలసిందిగా కోరుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.