Unlawful Activities Prevention Act దేశ వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టాన్ని దుర్వినియోగం చేయడం పై గత కొద్ది కాలంగా ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల నాయకుల ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వస్తున్నారు. సుప్రీం కోర్టు సైతం పలు కేసుల్లో ఉపా చట్టం దుర్వినియోగంపై ఆయా కేసుల్లో అధికారులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టి కాయలు వేస్తోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు ఠాణాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(ఉపా) కింద పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, ప్రగతిశీల కార్మిక సంఘం బాధ్యులు ఎ.అన్నపూర్ణపై నమోదు చేసిన కేసు విషయంలో పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోరని భావిస్తున్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యాజ్యాలపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు బుధవారం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేశారు. ఉపా చట్టం కింద తమపై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చిలుకా చంద్రశేఖర్, అన్నపూర్ణ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్ల అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోరారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణ ఈనెల 22కు వాయిదా పడింది.
ఇవీ చూడండి: