ETV Bharat / state

పాడేరులో వైకాపా ప్లీనరీ.. జనం బయటకు వెళ్లకుండా ఏం చేశారంటే..? - అల్లూరి సీతారామరాజు జిల్లా వార్తలు

Paderu ycp plenary: అసలే అధికార పార్టీ ప్లీనరీ.. సక్సెస్​ చేయడానికి నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. జనం మధ్యలో వెళ్లిపోతే ఎలా అనుకున్నారేమో.. వెంటనే పకడ్బందీ వ్యూహం వేశారు. సమావేశం ముగిసే వరకూ ఎవరూ బయటకు వెళ్లకుండా సమావేశ హాలు గేట్లకు తాళం వేసేశారు. అల్లూరి జిల్లా పాడేరులో వైకాపా ప్లీనరీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ycp plenery at paderu
ycp plenery at paderu
author img

By

Published : Jul 1, 2022, 6:12 PM IST

Gates locked in Paderu YCP plenery: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైకాపా ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. అయితే మరో కార్యక్రమం ఉందని వైవీ సుబ్బారెడ్డి ముందుగానే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో జనం మధ్యలో వెళ్లిపోకుండా వైకాపా నేతలు పకడ్బందీ వ్యూహం వేశారు. కార్యక్రమానికి వచ్చిన జనం బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రధాన గేట్లకు వైకాపా కార్యకర్తలు తాళాలు వేశారు. దీంతో సమావేశానికి వచ్చిన జనం అసహనం వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెనుక వైపు నుంచి కూడా ఎవరూ వెళ్లకుండా తాళం పెట్టేశారని.. మంచినీళ్ల కోసమని చెప్పినా బయటకు పంపలేదని కొందరు వాపోయారు.

పాడేరులో వైకాపా ప్లీనరీ

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.