తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. తల్లి తన ప్రేమను బిడ్డపై కురిపిస్తే.. ఏ కష్టం రాకుండా చూసుకునే వాడే తండ్రి. పిల్లల జీవితం సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు తమ సంతోషాలను త్యాగం చేస్తారు. పాడేరు పట్టణానికి చెందిన భార్యభర్తలు ఆదిబాబు, స్వాతి ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. మండల పరిషత్తు కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. మూడో సంతానంగా కొడుకు కాళ్లు వంకర తిరిగి జన్మించడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. డబ్బులు ఖర్చయ్యాయ్యే తప్ప ఫలితం లేదు. అవిటితనాన్ని సరిదిద్దడం కష్టమని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో వెనుదిరిగారు. చిన్నతనం నుంచి మంచానికే పరిమితమైన కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటూ వస్తున్నారు.
కూలి పనులు చేసుకుంటూ..: ఉదయాన్నే నిద్ర లేవడం... కుమారుడి కాలకృత్యాలు తీర్చడం... స్నానం చేయించి అల్పాహారం అందించడంతో వారి దినచర్య మొదలవుతోంది. ఎండెక్కిన తర్వాత జీవనోపాధి నిమిత్తం కూలి పనులకు వెళ్తూ వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నెలనెలా దివ్యాంగ పింఛను వస్తోందని, మంచానికే పరిమితమైనవారికి కిడ్నీ సంబంధ రోగులకు ఇచ్చినట్లు నెలకు రూ.పది వేలు పింఛనుగా ఇస్తారని తెలియడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు ఆదిబాబు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: