తెలంగాణలో విలీనం చేయాలంటూ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 5 పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ తీర్మానించిన 5 గ్రామాల ప్రజలు.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ముంపు ప్రాంతంలో ఉన్న విలీన పంచాయతీలైన ఎటపాక, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయగూడెం ప్రజలు.. కన్నాయగూడెం జాతీయ రహదారిపై బైఠాయించారు.
మహిళలు గ్రామ సచివాలయంలో ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలోనూ కనీస సాయం అందలేదని వాపోయారు. తెలంగాణలో కలిపితేనే తమకు న్యాయం జరుగుతుందని.. అందుకే విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. 'ఆంధ్ర వద్దు.. తెలంగాణ ముద్దు' అంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి