Tiger Roaming : అల్లూరి జిల్లాలో పులి ప్రజలను భయపెడుతోంది. అనంతగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ పశువులను పొట్టన పెట్టుకుంటోంది. దీంతో అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగి ఎలాగైనా పెద్దపులిని పట్టుకోవాలని చర్యలను చేపట్టారు. అనంతగిరి ప్రాంతంలో రెండు పెద్ద పులులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చిలకల గడ్డ తదితర అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పెద్దపులిని ప్రాణాలతో పట్టుకునేందుకు అనువుగా పెద్ద బోనులను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పులికి ఎర వేసేందుకు కూడా చర్యలు చేపట్టారు.. వీటితో పాటుగా పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విశాఖ జూ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు పెద్దపులిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే పెద్దపులి మండలంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ దాదాపు 10 పశువులను పొట్టన పెట్టుకుంది. దీంతో స్థానికులు రాత్రివేళ తిరిగేందుకు భయపడుతున్నారు.
ఇవీ చదవండి: