ETV Bharat / sports

Tokyo Olympics: అమ్మాయిలపై ఆ దృష్టి ఉండకూడదని.. - ఒలింపిక్స్​లో లింగ సమానత్వం

టోక్యో ఒలింపిక్స్​లో లింగసమానత్వానికి ప్రాధాన్యమిచ్చే దిశగా మరో ముందడుగు పడింది. పోటీల సందర్భంగా అమ్మాయిల శరీరాన్ని అతిగా ప్రదర్శించేలా, అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలను, వీడియోలను ప్రసారం చేయకూడదని ఒలింపిక్స్​ అధికారిక ప్రసారదారు నిర్ణయించింది.

tokyo olympics
టోక్యో ఒలింపిక్స్
author img

By

Published : Jul 27, 2021, 2:59 PM IST

లింగ సమానత్వానికి ప్రాధాన్యమిచ్చిన టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా అథ్లెట్లపై ఉండే వేరే దృష్టిని మార్చే దిశగా మరో అడుగు పడింది. పోటీల సందర్భంగా అమ్మాయిల శరీరాన్ని అతిగా ప్రదర్శించేలా, వ్యక్తిగత అవయవ భాగాలు కనిపించేలా, అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఒలింపిక్స్‌ అధికారిక ప్రసారదారు ప్రకటించింది.

"స్పోర్ట్‌ అప్పీల్, నాట్‌ సెక్స్‌ అప్పీల్‌" అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఒలింపిక్స్‌ నిర్వాహకులు మైదానంతో పాటు తెరపైనా లింగ సమానత్వం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. "గతంలో చూపించినట్లుగా ఈ క్రీడల్లో కొన్ని సన్నివేశాలు తెరపై కనిపించవు. అథ్లెట్ల శరీర భాగాలను వివరంగా, దగ్గరగా చూపించడం ఉండదు" అని ఒలింపిక్‌ ప్రసారదారు సేవల సీఈఓ యానిస్‌ ఎక్సార్చోస్‌ తెలిపాడు. ఇలా అయితే బీచ్‌ వాలీబాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, ట్రాక్‌ విభాగాల్లో అమ్మాయిల పోటీలను చిత్రీకరించడం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

ఇలాంటి క్రీడాంశాల్లో మహిళా అథ్లెట్లు సౌకర్యం కోసం బికినీల్లాంటి కురచ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఆ అథ్లెట్లను కొంతమంది కామ వాంఛతో చూసే ప్రమాదం ఉంది. ఇప్పటికే మహిళా జిమ్నాస్ట్‌లపై లైంగిక వేధింపులతో పాటు వాళ్లను వేరే దృష్టిలో చూడడం ఎక్కువైంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే టోక్యోలో జర్మనీ జిమ్నాస్ట్‌లు కాలి మడమ వరకూ నిండుగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించి పోటీల్లో పాల్గొన్నారు. పోటీపడే అమ్మాయిలు వేసుకునే దుస్తులపై ఇప్పటివరకూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఎలాంటి నిబంధనలు విధించలేదు కానీ ప్రసార దృశ్యాలను మాత్రం ఇప్పుడు నియంత్రించనుంది.

ఇదీ చదవండి: ఒలింపిక్స్​ నుంచి ఓటమితో వైదొలిగిన ఒసాకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.