ETV Bharat / sports

olympics live: క్వార్టర్స్​లో పూజారాణి.. సాయిప్రణీత్​ ఓటమి - దీపికా కుమారి ఒలింపిక్స్

deepika kumari
దీపికా కుమారి
author img

By

Published : Jul 28, 2021, 8:08 AM IST

Updated : Jul 28, 2021, 3:30 PM IST

15:25 July 28

సాయి ప్రణీత్​ ఓటమి

పురుషుల బ్యాడ్మింటన్​ సింగిల్స్​ గ్రూప్​ డీ మ్యాచ్​లో నెదర్లాండ్​కు చెందిన మార్క్​ కాల్జౌపై భారత స్టార్​ షట్లర్​ సాయి ప్రణీత్​ ఓటమిని ఎదుర్కొన్నాడు. 

15:09 July 28

రౌండ్​-16లో దీపికా కుమారి విజయం

మహిళా ఆర్చర్ దీపికా కుమారి.. రౌండ్ 16లోనూ సత్తా చాటింది. అమెరికాకు చెందిన ఆర్చర్​ జెన్నిఫర్​ ముసినో ఫెర్నాండేజ్​పై 6-4తో​ విజయం సాధించి.. 1/8 ఎలిమినేషన్​ రౌండ్​కు చేరుకుంది.  

14:55 July 28

భారత బాక్సర్ పూజా రాణి అదరగొట్టింది. రౌండ్ ఆఫ్ 16లో ఇచ్రక్ చైబ్​ను ఓడించి క్వార్టర్స్​కు దూసుకెళ్లింది. ఇచ్రక్​పై 5-0 తేడాతో గెలిచింది పూజ.

14:23 July 28

దీపికా కుమారి రౌండ్-16కు

ప్రముఖ మహిళా ఆర్చర్ దీపికా కుమారి.. రౌండ్ 16కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన రౌండ్-32లో భూటాన్ చెందిన క్రీడాకారిణి కర్మాపై 6-0 తేడాతో విజయం సాధించింది.

13:32 July 28

ఎలిమినేషన్​ రౌండ్​లో పోటీపడిన ప్రవీణ్ జాదవ్.. 0-6 తేడాతో ఓడిపోయాడు. యూఎస్ఏకు చెందిన ఎల్లీసన్ బ్రాడీ చేతిలో పరాజయం చెందాడు. దీంతో వ్యక్తిగత విభాగంలో ఇతడి ప్రయాణం ముగిసింది.

12:47 July 28

పురుషుల ఆర్చరీ వ్యక్తిగత విభాగం రౌండ్​-32లో భారత ఆర్చర్​ ప్రవీణ్​ జాదవ్​ అర్హత సాధించాడు. ​రష్యా ఆర్చర్​ గాల్సన్​ బజర్​జాపోవ్​పై 6-0 తేడాతో గెలుపొందాడు.

08:35 July 28

పురుషుల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో తరుణ్​దీప్ రాయ్ ప్రయాణం ముగిసింది. ఇటలీకి చెందిన షన్నీ ఇటే చేతిలో 6-5 తేడాతో ఓటమిపాలయ్యాడు.

08:27 July 28

రౌండ్-16లోకి సింధు

స్టార్ షట్లర్ పీవీ సింధు ఆకట్టుకునే ప్రదర్శన చేసి రౌండ్-16లోకి ప్రవేశించింది. హాంకాంగ్​కు చెందిన చేంగ్ న్గాన్ యి పై 21-9, 21-16 తేడాతో గెలిచింది.

08:10 July 28

ఆర్చరీలో తరుణ్​దీప్ ముందడుగు

టోక్యో ఒలింపిక్స్‌లో ఆరో రోజు పతకానికి అవకాశం ఉన్న ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో.. తరుణ్‌దీప్‌రాయ్ తొలి రౌండ్‌లో విజయకేతనం ఎగురవేశాడు. ఉక్రెయిన్ ఆటగాడు ఓలెక్సీ హన్ బిన్‌తో పోటీ పడిన తరుణ్‌దీప్‌.. ఎలిమినేషన్స్‌ రౌండ్‌లో 6-4 తేడాతో విజయం సాధించి.. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు

07:43 July 28

గ్రేట్ బ్రిటన్​ చేతిలో పరాజయం

బుధవారం జరిగిన మ్యాచ్​లో భారత హాకీ మహిళా జట్టు ఓడిపోయింది. గ్రేట్ బ్రిటన్ చేతిలో 1-4 తేడాతో పరాజయం చెందింది. మన జట్టు తరఫున దేవి షర్మిలా మాత్రమే గోల్ చేసింది.

Last Updated : Jul 28, 2021, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.