ETV Bharat / sports

Tokyo Olympics: కరోనా భయపెట్టినా.. ఒలింపిక్స్​ ఆగలేదు - టోక్యో ఒలింపిక్స్ కరోనా కేసులు

టోక్యో నగరంలో వేగంగా కరోనా వైరస్​ వ్యాపిస్తున్నా.. ఒలింపిక్స్​పై ఎలాంటి ప్రభావం పడలేదు! ఆగస్టు 5న అత్యధికంగా 5 వేలకుపైగా కేసులు నమోదైనా.. ఒలింపిక్​ గ్రామానికి మినహాయింపే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​తో కొట్టుమిట్టాడుతుంటే.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ జపాన్​ ప్రభుత్వం విజయవంతంగా విశ్వక్రీడలను నిర్వహించింది. క్రీడాకారులు వైరస్​ బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఈ క్రీడలకు ఆటంకం తలెత్తకుండా.. జపాన్​ ప్రభుత్వం ఎలా నిర్వహించిందో తెలుసుకుందాం.

Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్​
author img

By

Published : Aug 8, 2021, 7:39 PM IST

కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్​ను వాయిదా వేయాలంటూ సొంత దేశ ప్రజల నుంచే వ్యతిరేకత. ఓ వైపు కొవిడ్ కేసులు పెరుగుదల, మరోవైపు పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించడం.. ఇలా ఎన్ని ప్రతికూలతలు వచ్చినా తట్టుకొని నిలబడింది జపాన్​ ప్రభుత్వం. ఐపీఎల్​, పీఎస్​ఎల్​ వంటి క్రికెట్​ లీగ్​లు కరోనాకు ప్రభావితమైనప్పటికీ.. ఇంత పెద్ద ఈవెంట్​ను విజయవంతంగా నిర్వహించింది. ఆదివారంతో(ఆగస్టు 8) విశ్వక్రీడలు దిగ్విజయంగా ముగిశాయి.

Tokyo Olympics
ఒలింపిక్స్​లోని ఓ దృశ్యం
Tokyo Olympics
గెలిచిన ఆనందంలో ఆటగాళ్లు

రోజుకు 5 వేల కేసులొచ్చినా..

ఒలింపిక్స్​-2020కి వేదికైన జపాన్​లోని టోక్యో నగరంలో రోజుకు సగటున 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 5న అత్యధికంగా 5,042 కేసులు రావడం గమనార్హం. అయితే ఇందులో టోక్యోలోని ఒలింపిక్​ గ్రామం అందుకు మినహాయింపు. ఎందుకంటే ఆ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విశ్వక్రీడల ఆరంభంలో కొన్ని కరోనా కేసులు వచ్చినా.. క్రమేపి నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తల వల్లే ఈ క్రీడలు నిర్విరామంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అవాంతరాలు రాకుండా క్రీడలను నిర్వహించడంలో జపాన్​ ప్రభుత్వం విజయం సాధించింది.

Tokyo Olympics
ఖాళీ స్టేడియాల్లో ఆటల నిర్వహణ
Tokyo Olympics
టోక్యో నగరం
Tokyo Olympics
మాస్క్​లతో జపాన్​ ప్రజలు

ఎమర్జెన్సీ విధించి..

ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు.. అంటే జులై మధ్యలో టోక్యో నగరమంతా ఎమర్జెన్సీ విధించింది జపాన్​ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పౌరులెవరూ బయటకు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. అయితే క్రీడల ఆరంభంలో అక్కడికి చేరుకున్న విదేశీ క్రీడాకారుల సహా కొంతమంది అధికారులు వైరస్​ బారిన పడినా.. ఆ తర్వాత అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ విశ్వక్రీడలను సునాయాసంగా నిర్వహించింది.

Tokyo Olympics
మాస్క్​లతోనే ఆటను వీక్షిస్తూ
Tokyo Olympics
సైక్లింగ్​లోని ఓ దృశ్యం

ప్రేక్షకులను నో ఎంట్రీ..

టోక్యో ఒలింపిక్స్​ నిర్విరామంగా కొనసాగేందుకు వీలుగా.. ఒలింపిక్​ గ్రామంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం సహా స్టేడియాల్లోకి ఇతరులతో పాటు ప్రేక్షకులను అనుమతించలేదు.

Tokyo Olympics
మాస్క్​తో స్టార్​ టెన్నిస్ ప్లేయర్​ నవోమి ఒసాకా

ఒక విధంగా చెప్పాలంటే ఆ గ్రామానికి టోక్యో నగరానికి ఎలాంటి సంబంధం లేదనే విధంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. క్రీడాకారులు వినియోగించిన వస్తువులను, ప్రదేశాలను తరచుగా శానిటైజ్ చేశారు. ఇలా అనేక ప్రత్యేక జాగ్రత్తలు వహించి.. వైరస్​ను ఒలింపిక్​ గ్రామంలోకి రాకుండా చేశారు. విశ్వక్రీడలను దిగ్విజయంగా ముగించారు.

Tokyo Olympics
బాక్సింగ్​ రింగ్​ను శానిటైజ్​ చేస్తున్న సిబ్బంది
Tokyo Olympics
శానిటైజ్​ చేస్తూ

కొవిడ్​ ఉన్నా నిర్వహించాం..

విశ్వక్రీడల విజయవంతంపై ఒలింపిక్స్​ ఇండిపెండెంట్​ ఎక్స్​పర్ట్​ ప్యానల్​ ఛైర్మన్​ బ్రియాన్​ మెక్​క్లోస్కీ స్పందించారు. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా మహమ్మారి ఉన్నప్పటికీ ఒలింపిక్స్​ను నిర్వహించగలిగామని పేర్కొన్నారు. "మహమ్మారిని దూరంగా ఉంచడం సాధ్యమని టోక్యో ఒలింపిక్స్​ రూపంలో ప్రపంచానికి చాటిచెప్పాం. ఇది ప్రపంచ దేశాలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఈ మెగా ఈవెంట్​లో 6 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించాం" అని బ్రియాన్​ తెలిపారు.

Tokyo Olympics
మెడల్స్​ సమయంలోనూ మాస్క్​లతోనే
Tokyo Olympics
జిమ్నాస్టిక్స్​లోని ఓ దృశ్యం

క్రికెట్​ ఆగినా..

ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ను (పీఎస్​ఎల్​) నిర్వహించింది పాక్​ క్రికెట్​ బోర్డు. కానీ, 14 మ్యాచ్​లు జరిగిన తర్వాత ఏడుగురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. దీంతో లీగ్​ను నాలుగు నెలల పాటు వాయిదా వేశారు. మిగిలిన 20 మ్యాచ్​లను జూన్​లో యూఏఈ వేదికగా నిర్వహించారు.

దీంతో పాటు ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) 14వ సీజన్​లోనూ మొదట 29 మ్యాచ్​లు సజావుగానే సాగాయి. ఆ తర్వాత పలువురు క్రికెటర్లకు కొవిడ్ ​అంటుకుంది. దీంతో ఈ లీగ్​ను కూడా వాయిదా వేయక తప్పలేదు. ఈ టోర్నీ రెండో దశను సెప్టెంబర్​ 19 నుంచి యూఏఈ వేదికగా నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

ఇటీవల ఇండియా- శ్రీలంక సిరీస్​పైనా ప్రభావం చూపింది.

తక్కువ మంది ఉండి.. బయోబబుల్స్​ ఏర్పాటు సహా అవసరమైనన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ క్రికెట్​ లీగ్​లపై కరోనా ప్రభావం పడింది. అటువంటిది ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల అథ్లెట్లు, సహాయక సిబ్బంది, మేనేజ్​మెంట్​, కోచ్​లు అందరూ కలిసి దాదాపు 11వేలకు పైగా మంది ఒకే చోట మెగా ఈవెంట్​ కోసం హాజరయ్యారు. అయినా కొవిడ్​ను ఎదురించి విశ్వక్రీడలను సజావుగా నిర్వహించింది జపాన్ ప్రభుత్వం.​

ఇదీ చూడండి.. తీరిన 41 ఏళ్ల కల.. టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు కాంస్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.