ETV Bharat / sports

Olympics Live: నిరాశపర్చిన ద్యుతీ చంద్

TOKYO OLYMPICS
టోక్యో ఒలింపిక్స్​
author img

By

Published : Aug 2, 2021, 7:16 AM IST

Updated : Aug 2, 2021, 4:51 PM IST

16:48 August 02

200 మీటర్ల విభాగంలో పోటీపడిన మహిళా రన్నర్ ద్యుతీ చంద్ నిరాశపరిచింది. తొలి రౌండ్​ హీట్​-4లో పోటీపడిన ఆమె.. 23.85 సెకన్లలో రేసు పూర్తి, చివరి స్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్​కు అర్హత సాధించలేకపోయింది.

11:53 August 02

షూటింగ్​లో నిరాశ..

టోక్యో ఒలింపిక్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌ విభాగంలోనూ భారత షూటర్లు నిరాశే మిగిల్చారు. ఈ విభాగంలో పోటీలో నిలిచిన ప్రతాప్‌ సింగ్ తోమర్‌.. సంజీవ్‌ రాజ్‌పుత్ ఇద్దరూ ఫైనల్స్‌కు అర్హత సాధించలేక పోయారు. తోమర్ 11 వందల 67 పాయింట్లతో 21వ స్థానంలో నిలవగా.. రాజ్‌పుత్‌ 11వందల 57 పాయింట్లతో 32వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ విభాగంలో కేవలం 8 మంది మాత్రమే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. కటాఫ్ పాయింట్లు 11వందల 76గా నిర్దేశించారు. రాజ్‌పుత్‌, తోమర్‌ కూడా విఫలం కావడం వల్ల భారత షూటర్లు వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ.. ఒక్క పతకం కూడా లేకుండానే ఇంటిదారి పట్టారు.

10:00 August 02

దుమ్మురేపిన మహిళల హాకీ జట్టు.. క్వార్టర్స్​లో విజయం
టోక్యో ఒలింపిక్స్​లో మహిళల హాకీ జట్టు సెమీస్​లోకి దూసుకెళ్లింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్స్​ పోరులో 1-0 తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్​ ఆద్యంతం దూకుడు ప్రదర్శించింది రాణి రాంపాల్​సేన. రెండో క్వార్టర్​లో గోల్​ సాధించింది.. ఆ తర్వాత.. ఆస్ట్రేలియాను ఖాతా తెరవనీయకుండా అడ్డుకోగలిగింది.

09:37 August 02

విజయానికి అడుగు దూరంలో..

క్వార్టర్స్​లో విజయానికి అడగు దూరంలో నిలిచింది భారత మహిళల హాకీ జట్టు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న పోరులో మూడో క్వార్టర్​ ముగిసే సమయానికి 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఇంకొక్క క్వార్టర్​లో ఆస్ట్రేలియాను నిలువరిస్తే.. టీమ్​ఇండియా సెమీస్​కు చేరుకుంటుంది.

09:11 August 02

భారత్​దే పైచేయి..

క్వార్టర్​ ఫైనల్​లో రెండు క్వార్టర్లు ముగిసే సరికి భారత మహిళల జట్టు మ్యాచ్​పై పట్టు సాధించింది. ప్రస్తుతం 1-0తో ముందంజలో ఉంది.

09:01 August 02

తొలి గోల్​ భారత్​దే..

భారత మహిళల హాకీ జట్టు జోరు మీద ఉంది. క్వార్టర్స్​లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న పోరులో తొలి గోల్​ కొట్టిండి టీమ్​ఇండియా. ప్రస్తుతం స్కోరు 1-0తో ఉంది. మ్యాచ్​ ప్రస్తుతం రెండో క్వార్టర్​ లో ఉంది.

08:27 August 02

క్వార్టర్స్​ పోరు షురూ..

ఆస్ట్రేలియాతో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్​ పోరు ప్రారంభమైంది. ఎన్నో ఏళ్ల తర్వాత క్వార్టర్స్​కు టీమ్​ఇండియా వెళ్లడం వల్ల అందరి దృష్టి ఈ మ్యాచ్​పైనే ఉంది. ఈసారి హాకీలో చరిత్ర సృష్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

07:31 August 02

ద్యుతి చంద్​..

ఒలింపిక్స్​ మహిళల 200మీ పరుగులో ద్యుతి చంద్​ విఫలమైంది. రౌండ్​1 హీట్​1లో 200మీటర్లు 23.85 సెకన్లలో ముగించి 7వ స్థానంలో నిలిచింది. ఫలితంగా సెమీస్​కు అర్హత సాధించలేకపోయింది.

07:02 August 02

Olympics live: క్వార్టర్స్​ పోరు నేడే

ఒలింపిక్స్​లో ఆదివారం పతకాన్ని సొంతం చేసుకుని పీవీ సింధు చరిత్ర సృష్టించింది. టోక్యోలో ఉన్న భారత బృందానికి ఇది స్ఫూర్తినిచ్చే విషయం. ఇక సోమవారం మరిన్ని కీలక మ్యాచ్​లకు అథ్లెట్లు సన్నద్ధమవుతున్నారు.  

అథ్లెటిక్స్​- మహిళల 200మీ రౌండ్​1 హీట్​1లో ద్యుతి చంద్​ పోటీపడనుంది. ఈ పోరు ఉదయం 7:24కి జరగనుంది. ఇక టిమ్​ఇండియా మహిళల హాకీ జట్టు క్వార్టర్స్​ పోరు ఆస్ట్రేలియాతో ఉదయం 8 గంటలకు జరగనుంది. అటు మహిళల డిస్కస్ త్రో ఫైనల్​కు చేరుకున్న కమల్​ప్రీత్​ కౌర్​.. సాయంత్రం 4:30కి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Last Updated : Aug 2, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.