ETV Bharat / sports

కండోమ్‌ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం - కయాకింగ్

టోక్యో ఒలింపిక్స్​లో ఊహించని సంఘటన జరిగింది. క్యానో స్ప్రింట్ అనే క్రీడలో భాగంగా.. ఓ అథ్లెట్​ తన బోటును కండోమ్​తో రిపేర్​ చేసుకుంది. చివరకు ఆమె స్వర్ణపతకం గెలవడం విశేషం.

kayak, Jessica Fox
జెస్సికా ఫాక్స్, క్యానో స్ప్రింట్
author img

By

Published : Jul 30, 2021, 10:32 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో ఒక క్రీడాకారిణి స్వర్ణ పతకం సాధించడం వెనుక కండోమ్‌ కీలక పాత్ర పోషించిందంటే నమ్ముతారా? ఈ క్రీడల్లో క్యానో స్ప్రింట్ అనే ఒక విభాగం కూడా ఉంది. నీటిపై కయాకింగ్‌ చేయడమే ఈ ఈవెంట్‌ ప్రత్యేకత. ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల జెస్సికా ఫాక్స్.. ఈ వారంలో జరిగిన క్యానో స్ప్రింట్ స్లాలోమ్‌ సీ1 విభాగంలో అందర్నీ ఓడించి స్వర్ణ పతకం సాధించింది. అలాగే క్యానో స్లాలామ్‌ కె1 ఫైనల్‌లోనూ కాంస్యం సాధించింది. అయితే, ఇదంతా ఒక కండోమ్‌ సాయంతోనే జరిగిందని ఆమె అంటోంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

Jessica Fox
కండోమ్​ సాయంతో స్వర్ణం గెలిచి..

క్యానో స్ప్రింట్ క్రీడల్లో కయాకింగ్‌ ఒకటి. సన్నగా ఉండే పడవలో కేవలం ఒకరు మాత్రమే కూర్చొని తన శక్తి సామర్థ్యాలతో సరస్సులు, లేదా నదులపై ముందుకు సాగుతారు. అయితే, ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న జెస్సికాకు అనుకోకుండా ఒక అవాంతరం ఏర్పడింది. తన పడవకు మరమ్మతుకు గురైంది. ఈ క్రమంలోనే దాన్ని సరిదిద్దేందుకు కార్బన్‌ మిశ్రమాన్ని ముందు భాగంలో అదిమిపెట్టి తర్వాత నీటిలో అది తొలగిపోకుండా ఉండేందుకు స్మూత్‌ ఫినిషింగ్‌ కోసమని కండోమ్‌ వాడారని ఆమె చెప్పింది. అలా తన విజయానికి ఆఖరి నిమిషంలో కండోమ్‌ ఉపయోగపడిందని వివరించింది. దాంతో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ఆ పడవ రిపేర్‌కు సంబంధించి ఆ కండోమ్‌ని ఎలా వాడారో తెలియజేసే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మీరూ దాన్ని చూసి నవ్వుకోండి.

ఇదీ చదవండి:ఒలింపిక్స్​లో సింధు రికార్డు.. తొలి క్రీడాకారిణిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.