ETV Bharat / sports

టాప్ ర్యాంక్ టెన్నిస్​ ప్లేయర్​కు కరోనా - టెన్నిస్ ప్లేయర్ దిమిత్రోవ్​కు కరోనా

గత వారం ఆడ్రియా టెన్నిస్ టోర్నీలో పాల్గొన్న ప్రముఖ ప్లేయర్ గ్రిగర్ దిమిత్రోవ్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఇతడు.. తనను ఈ మధ్య కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు.

గ్రిగర్​ డిమిట్రోవ్
author img

By

Published : Jun 22, 2020, 8:54 AM IST

ఆడ్రియా టెన్నిస్ టూర్​లో పాల్గొన్న ప్రపంచ నంబర్ 19 ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఇన్​స్టా వేదికగా పంచుకున్నాడు. తనతో గత కొద్దికాలంగా సన్నిహితంగా ఉన్నవారు వైరస్​ నిర్థరణ పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు పాటించాలని కోరాడు​.

"మొనాకో దేశంలో ఉన్నప్పుడు చేసిన పరీక్షల్లో నాకు కరోనా వచ్చినట్లు తెలిసింది. గత కొద్దిరోజులగా నాతో సన్నిహితంగా ఉన్నవారందరూ వైద్యపరీక్షలు చేయించుకోండి. తగిన జాగ్రత్తలు పాటించండి. నా వల్ల మీకు కలిగిన నష్టానికి క్షమాపణలు చెబుతున్నా. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, కోలుకుంటున్నాను"

-గ్రిగర్​ దిమిత్రోవ్​, ప్రముఖ టెన్నిస్​ ప్లేయర్​

17 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత నోవాక్ జకోవిచ్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్​ టోర్నీ జరుగుతుంది. దిమిత్రోవ్​కు కరోనా వచ్చిందని తెలిసిన నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన ఫైనల్​ను రద్దు చేశారు.

లాక్​డౌన్​ సడలింపుల్లో భాగంగా జూన్‌ 13 నుంచి జులై 5 వరకు సెర్బియా, క్రొయేషియా, మాంటెనెగ్రోలోని మట్టి కోర్టుల్లో ఈ టోర్నీకి సంబంధించి మ్యాచ్​లు జరుగుతున్నాయి. ఇందులో జకోవిచ్​, డొమినిక్‌ థీమ్‌తో పాటు గ్రిగర్‌ దిమిత్రోవ్‌, అలెగ్జాండర్‌ జ్వరేవ్‌ వంటి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు ల్గొన్నారు.

ఇది చూడండి : స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయల్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.