ETV Bharat / sports

టీ20 సారథిగా కోహ్లీ ప్రస్థానం.. ఇవే రికార్డులు - virat kohli captaincy retirement

అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్​గా విరాట్ కోహ్లీ (Kohli News) శకం ముగిసింది. టీమ్​ఇండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించిన కోహ్లీ టీ20 రికార్డుల (Virat Kohli t20 Stats as Captain) విశేషాలు తెలుసుకోండి.

virat kohli captaincy news
virat kohli
author img

By

Published : Nov 8, 2021, 8:31 PM IST

Updated : Nov 8, 2021, 10:02 PM IST

టీ20ల్లో కోహ్లీ శకం ముగిసింది (Kohli News). ప్రపంచకప్​లో నమీబియా మ్యాచ్​.. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్​గా విరాట్​ కోహ్లీకి చివరిది. సారథిగా ఇది అతడి 50వ మ్యాచ్​ కావడం విశేషం. ఎంఎస్ ధోనీ తర్వాత 2017లో ఇంగ్లాండ్​పై తొలిసారి పొట్టి ఫార్మాట్​లో కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు విరాట్. మేటి బ్యాటర్​గా కొనసాగుతున్న అతడు.. కెప్టెన్​గా (Virat Kohli t20 Stats as Captain) పలు రికార్డులు కైవసం చేసుకున్నాడు. ఇంతకీ అవేంటంటే?

virat kohli captaincy news
విరాట్
  • అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 49 మ్యాచుల్లో (నమీబియాతో మ్యాచ్​ మినహా) నాయకత్వం వహించిన కోహ్లీ.. 29 విజయాలను అందించాడు. ఎంఎస్​ ధోనీ తర్వాత (42 విజయాలు) తర్వాత అత్యధిక విజయాలు అతడివే.
  • అంతర్జాతీయ టీ20ల్లో సేనా దేశాలపై (ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా) గెలిచిన ద్వైపాక్షిక సిరీస్​లు గెలిచిన ఏకైక కెప్టెన్​ కోహ్లీనే కావడం విశేషం.
    virat kohli captaincy news
    కెప్టెన్ కోహ్లీ
  • అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసింది కోహ్లీనే. మొత్తం 94 మ్యాచ్​లు ఆడిన అతడు 52.05 సగటుతో 3227 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్​లో మూడు వేల పరుగులు సాధించిన తొలి ప్లేయర్​గా నిలిచాడు.
  • టీ20 ప్రపంచకప్​లలో రెండుసార్లు 'ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నీ'​గా నిలిచిన ఏకైక క్రికెటర్ కూడా అతడే.
  • అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక(29) హాఫ్​ సెంచరీలు చేశాడు. అయితే శతకాలు మాత్రం బాదలేదు.

టీ20ల్లో కోహ్లీ విధ్వంసం..

virat kohli captaincy news
కోహ్లీ

భారత్​ నుంచి ఒక్కడే!

టీ20ల్లో పదివేలకుపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు కోహ్లీ. ఈ జాబితాలో క్రిస్​గేల్​(14,276), కీరన్​ పొలార్డ్(11,236)​, షోయబ్​ మాలిక్ (11,033)​, కోహ్లీ(10,204), వార్నర్(10,019). భారత్​ తరఫున ఈ ఫీట్​ను అందుకున్న తొలి ఆటగాడు ఇతడే కావడం విశేషం. ఇప్పటికీ ఈ లిస్ట్​లో విరాట్ మాత్రమే టీమ్​ఇండియా నుంచి ఉన్నాడు.

virat kohli captaincy news
విరాట్ కోహ్లీ

టీ20 ప్రపంచకప్​లో అత్యధిక పరుగులు (virat kohli t20 world cup runs)

టీ20 ప్రపంచకప్​లో భారత్​ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు కోహ్లీ. 21 మ్యాచ్​ల్లో 76.81 సగటుతో 845 రన్స్​ చేశాడు. ఇందులో 10 హాఫ్​సెంచరీలు ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లలో మహేలా జయవర్దనె(1,016), క్రిస్​గేల్​(965), దిల్షన్​(897) రన్స్​తో కొనసాగుతున్నారు.

virat kohli captaincy news
కోహ్లీ, రోహిత్

ఓకే సీజన్​లో ఎక్కువ రన్స్​..

2014లో ఆరు మ్యాచ్​ల్లో 106.33 సగటుతో 319 పరుగులు చేసి.. ఒకే సీజన్​లో అత్యధిక రన్స్​ చేసిన ప్లేయర్​గా నిలిచాడు విరాట్​. ఈ ప్రపంచకప్​ ఫైనల్​లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్​గా నిలిచింది టీమ్​ఇండియా.

ఇదీ చూడండి: T20 world cup: టాస్​ గెలిచిన కోహ్లీసేన.. నమీబియా బ్యాటింగ్

Last Updated : Nov 8, 2021, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.