ETV Bharat / sports

T20 World Cup: 'హార్దిక్‌, భువీని తప్పించి వాళ్లని తీసుకోవాలి' - టీమిండియా న్యూస్ టుడే

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ సమీపిస్తున్న తరుణంలో భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ప్లేయర్ గవాస్కర్ టీమిండియాలో రెండు మార్పులను సూచించారు. అయితే భారీ మార్పులు చేస్తే భారత జట్టుపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించాడు.

gavaskar
సునీల్ గవాస్కర్‌
author img

By

Published : Oct 29, 2021, 5:38 AM IST

టీ20 ప్రపంచకప్‌ సూపర్ 12లో భాగంగా అక్టోబర్‌ 31న భారత్‌, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే కసితో ఉంది. కీలకమైన ఈ పోరుకు భారత జట్టు రెండు మార్పులను చేయాలని భారత మాజీ ఆటగాడు సునీల్‌ గవాస్కర్ సూచించారు. హార్దిక్‌ పాండ్య స్థానంలో ఇషాన్‌ కిషన్‌ని, భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకోవాలని సలహా ఇచ్చారు.

"పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య భుజానికి గాయమైంది. దీంతో అతడు బౌలింగ్‌ చేయకపోతే.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ని హార్దిక్ స్థానంలో తీసుకోవాలని సూచిస్తా. భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ పేరుని పరిశీలించవచ్చు. అలాగని భారీ మార్పులు చేస్తే భారత జట్టు మ్యాచ్‌ గురించి భయపడుతోందని న్యూజిలాండ్‌ భావించే అవకాశం ఉంది"

-సునీల్ గవాస్కర్

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య 8 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. ఇక, భువీ విషయానికొస్తే.. మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక వికెట్‌ కూడా పడగొట్టకుండా 25 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.