ETV Bharat / sports

WFI రద్దు చేయాల్సిందేనంటున్న రెజ్లర్లు.. ఆదివారం బ్రిజ్​ భూషణ్​ రాజీనామా! - undefined

భారత రెజ్లింగ్‌ సమాఖ్యను వెంటనే రద్దు చేయకపోతే అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసులు నమోదు చేస్తామని చెప్పారు రెజ్లర్లు. బ్రిజ్ భూషణ్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అగ్రశ్రేణి రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. మరోవైపు, ఆదివారం అయోధ్యలో జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ నిర్ణయించారు. ఈ మీటింగ్‌లో బ్రిజ్ భూషణ్ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

wrestlers-protest-second-day-against-wfi-president

author img

By

Published : Jan 19, 2023, 8:09 PM IST

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వినేశ్ ఫొగాట్, బజరంగ్‌ పునియా, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్‌ సహా పలువురు క్రీడాకారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునియా మాట్లాడుతూ.. "ఈ దేశం కోసం మేం పోరాడుతున్నప్పుడు.. మా హక్కుల కోసం పోరాడుతాం" అని తెలిపాడు. బ్రిజ్‌ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే వరకు ఈ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశాడు.

'WFI రద్దు చేయకపోతే అతడిపై కేసు పెడతాం'
తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని కేంద్రం ప్రభుత్వం హామీ ఇచ్చిందని రెజ్లరు తెలిపారు. అయితే సంతృప్తికరమైన ప్రతిస్పందన మాత్రం లేదని, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను వెంటనే రద్దు చేయకపోతే అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై అనేక కేసులు పెడతామని చెప్పారు. తాము నిజమే చెబుతున్నామని, నమ్మండని అన్నారు. అసలు బ్రిజ్​ భూషన్​ ఎక్కడ ఉన్నారని రెజ్లర్లు ప్రశ్నించారు

'ప్లీజ్​ స్టేజ్​ దిగండి బృందా మేడమ్​ '
ఈ క్రమంలో వారికి మద్దతు తెలిపేందుకు బృందా కారాట్‌ నిరసన స్థలానికి వచ్చారు. వేదికపైకి ఎక్కిన ఆమెతో భజరంగ్‌ పునియా మాట్లాడాడు. 'ప్లీజ్‌ మేడమ్.. ఈ వేదిక నుంచి దిగి వెళ్లిపోండి. ఇది అథ్లెట్లు చేస్తోన్న పోరాటం. దీనిని రాజకీయం చేయకండి’ అని పునియా ఆమెను వేడుకున్నాడు. కాగా దీనిపై బృందా కారాట్ మీడియాతో మాట్లాడారు. 'మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసేందుకే ఇక్కడికి వచ్చాం' అని ఆమె మీడియాతో అన్నారు.

మధ్యవర్తిగా బబితా ఫొగాట్‌..
మరోవైపు, మరో రెజ్లర్‌ బబితా ఫొగాట్‌ ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా గురువారం ధర్నా ప్రాంతానికి వచ్చి రెజ్లర్లతో మాట్లాడారు. "అథ్లెట్లకు ప్రభుత్వం మద్దతుగా ఉంది. ఈ సమస్యను ఈ రోజే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా" అని బబిత తెలిపారు. మరోవైపు ఆందోళన చేస్తోన్న రెజ్లర్లకు పలువురు ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు.

కమిటీ యోచనలో కేంద్రం..
బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర క్రీడల శాఖ స్పందిస్తూ.. 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్‌ఐని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే జాతీయ క్రీడా నియమావళి ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిలో ఇద్దరు మహిళా సభ్యులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

అనురాగ్‌ ఠాకూర్‌కు బ్రిజ్‌ భూషణ్‌ ఫోన్‌
ఇదిలా ఉండగా.. సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ నేడు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్​కు ఫోన్‌ చేశారు. రెజ్లర్లు చేస్తోన్న ఆరోపణలపై ఆయన కేంద్రమంత్రికి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనపై నిన్న స్పందించిన భూషణ్‌.. తనపై ఓ పారిశ్రామికవేత్త కుట్రకు పాల్పడుతున్నట్లు తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు చేస్తే ఉరిశిక్షకు సిద్ధమని చెప్పాడు.

అయోధ్యలో మీటింగ్​.. బ్రిజ్ భూషణ్​ రాజీనామా!
ఈ క్రమంలోనే అత్యవసర పరిస్థితుల నడుమ వచ్చే ఆదివారం అయోధ్యలో జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని అనురాగ్​ ఠాకూర్​ నిర్ణయించారు. ఈ మీటింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బ్రిజ్‌ భూషణ్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని, రెజ్లర్లపై అసభ్య పదజాలాన్ని వాడాడని వీరు ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఆయన చాలా ఏళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని వినేశ్ ఫొగాట్‌ ఆరోపించింది. లఖ్‌నవూలో జాతీయ శిబిరంలో అనేక మంది కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగిక దోపిడీ చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఈ ఆరోపణలు పెను వివాదానికి దారితీశాయి. బ్రిజ్‌ భూషణ్‌ 2011 నుంచి పదవిలో ఉంటున్నారు. 2019 ఫిబ్రవరిలో మూడోసారి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన భాజపా ఎంపీ కూడా.

For All Latest Updates

TAGGED:

wrestlers
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.