ETV Bharat / sports

Vinesh Phogat Asian Games : ఆసియా గేమ్స్​ నుంచి వినేశ్ ఫొగాట్​ ఔట్ - భారత రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ ఆసియా గేమ్స్​

Vinesh Phogat Asian Games : భారత స్టార్ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​కు ఆసియా గేమ్స్​లో మినహాయింపు ఇవ్వడంపై దుమారం కొనసాగుతోంది. ఈ తరుణంలో కీలక పరిణామం జరిగింది. తాను ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదని వినేశ్‌ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Vinesh Phogat Asian Games
Vinesh Phogat Asian Games
author img

By

Published : Aug 15, 2023, 6:24 PM IST

Updated : Aug 15, 2023, 7:12 PM IST

Vinesh Phogat Asian Games : ఆసియా క్రీడల కు నేరుగా ప్రవేశం పొందిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌ ఆ పోటీల నుంచి వైదొలిగింది. తనకు మోకాలి గాయం కావడం వల్ల వచ్చే నెలలో జరగబోయే ఆసియా గేమ్స్​ తాను పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్​' (ఇంతకుముందు ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

''ఆగస్టు 13న ట్రైనింగ్‌ చేస్తున్న సమయంలో నా ఎడమ మోకాలికి గాయమైంది. వెంటనే డాక్టర్లను సంప్రదించా. స్కాన్​లు, ఇతర టెస్టులు చేసి.. సర్జరీ ఒక్కటే మార్గమని వైద్యులు సూచించారు. దీంతో ఆగస్టు 17న ముంబయిలోని ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుంటున్నాను. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్​లో దేశానికి ప్రాతినిధ్యం వహించి గోల్డ్​ మెడల్ సాధించా. ఈసారి కూడా స్వర్ణ పతకాన్ని దక్కించుకోవాలని కలలుకన్నా. కానీ దురదృష్టవశాత్తూ ఈ గాయం వల్ల ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయా. నాకు గాయం అయిన విషయాన్ని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశాను. దీనివల్ల, నా బదులుగా ఆసియా గేమ్స్​కు రిజర్వ్‌ ఆటగాళ్లను పంపేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటివరకు మీరు నాపై చూపించిన ప్రేమను ఇకముందు కూడా కొనసాగించాలని అభిమానులను కోరుకుంటున్నాను. అప్పుడే నేను బలంగా తిరిగొచ్చి 2024లో జరగబోయే పారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నద్ధం కాగలను. మీ మద్దతే నాకు అండ'' అని వినేశ్‌ ఫొగాట్​ రాసుకొచ్చింది.

ప్రముఖ రెజ్లర్లు బజ్‌రంగ్‌ పునియా, వినేశ్ ఫొగాట్‌కు ట్రయల్స్‌ నుంచి మినహాయింపునిచ్చి.. ఆసియా గేమ్స్​లో నేరుగా ప్రవేశం కల్పిస్తూ డబ్ల్యూఎఫ్‌ఐ అడ్‌హక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై రెజ్లర్లు అంతిమ్‌ పంగాల్‌, సుజీత్‌ కల్కల్‌ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే వీరి పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు వినేశ్‌ పోటీల నుంచి వైదొలడంపై ఆమె స్థానంలో అంతిమ్‌ పంగాల్‌ ఆసియా క్రీడలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. అండర్‌-20 వరల్డ్​ ఛాంపియన్‌ అయిన పంగాల్‌.. ఇప్పటికే ట్రయల్స్‌లో గెలిచింది. దీంతో ఆసియా క్రీడలకు స్టాండ్‌బైగా ఎంపిక అయింది. సెప్టెంబరు 23 నుంచి హాంగ్‌ఝౌ వేదికగా ఆసియా గేమ్స్​ ప్రారంభం కానున్నాయి.

వినేశ్ ఫొగాట్​, బజరంగ్​ పునియాకు ట్రయల్స్ నుంచి మినహాయింపు.. ఎందుకో తెలుసా?

ర్యాంకింగ్​ సిరీస్ టోర్నీ​​ నుంచి వైదొలిగిన వినేశ్​ ఫొగాట్​.. కారణం అదేనా?

Last Updated : Aug 15, 2023, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.