ETV Bharat / sports

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్​కు పీవీ సింధు దూరం - పీవీ సింధు వరల్డ్​ ఛాంపియన్​ షింప్​

ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు భారత్​ స్టార్​ బ్యాడ్మింటన్ ప్లేయర్​ పీవీ సింధు దూరమైంది. గాయం కారణంగా ఆమె వైదొలిగినట్లు పలు రిపోర్ట్‌లు చెబుతున్నాయి.

pv sindhu
pv sindhu
author img

By

Published : Aug 13, 2022, 9:37 PM IST

Updated : Aug 13, 2022, 9:46 PM IST

PV Sindhu WC: బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు (డబ్ల్యూసీ) దూరమైంది. గాయం కారణంగా ఆమె వైదొలిగినట్లు పలు రిపోర్ట్‌లు చెబుతున్నాయి. చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వర్గాలు వెల్లడించాయి. కామన్వెల్త్‌గేమ్స్‌ సింగిల్స్ ఫైనల్‌లోనూ సింధు గాయంతోనే ఆడినట్లు పేర్కొన్నాయి.

ఆగస్టు 21 నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం కానుంది. డబ్ల్యూసీలో పీవీ సింధుకు మంచి రికార్డు ఉంది. 2019 సీజన్‌లో స్వర్ణంతోపాటు అంతకుముందు రెండు కాంస్య పతకాలను సాధించింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఈసారి టోక్యో ఆతిథ్యం ఇస్తోంది.

ఇదీ చదవండి: డకౌట్​ అయ్యానని ఆ ఫ్రాంచైజీ ఓనర్ చెంపదెబ్బలు కొట్టాడన్న మాజీ ప్లేయర్​

టీమ్​ఇండియాకు సవాల్​ విసిరిన ఆ దేశ క్రికెట్​ కోచ్

Last Updated : Aug 13, 2022, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.