ETV Bharat / sports

Malaysia Masters: క్వార్టర్​ ఫైనల్స్​కు దూసుకెళ్లిన పీవీ సింధు - మలేసియా క్వార్టర్​ ఫైనల్స్​

PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ.. క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు. కౌలాలంపుర్​ వేదికగా జరిగిన ప్రీక్వార్టర్స్‌లో 21-12, 21-10 తేడాతో చైనాకు చెందిన​ జాంగ్​ యీపై సింధు విజయం సాధించింది.

Sindhu glides into Malaysia Masters quarterfinals

author img

By

Published : Jul 7, 2022, 12:43 PM IST

Malaysia Masters 2022: రెండు సార్లు ఒలింపిక్​ విజేత పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్​ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. కౌలాలంపుర్​ వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో సింధు.. 21-12, 21-10తో జాంగ్​ యీ(చైనా)​పై విజయం సాధించింది. ఈ మ్యాచ్​ 28 నిమిషాల్లోనే ముగిసింది.

అంతకుముందు బుధవారం జరిగిన తొలి రౌండ్​లో చైనాకు చెందిన హి బింగ్‌ జియావొ​పై సింధు గెలిచింది. 21-13,17-21,21-15 తేడాతో విజయం సాధించింది. మరోవైపు, పురుషుల సింగిల్స్​లో తొలి రౌండ్​లో గెలిచి.. రెండో రౌండ్​ చేరుకున్న భారత షట్లర్​ సాయి ప్రణీత్​కు నిరాశ ఎదురైంది. చైనాకు చెందిన లీ షి ఫెంగ్​ చేతిలో 14-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.

ఇదీ చదవండి: చివరి వింబుల్డన్​లో సానియా ఓటమి.. మ్యాచ్​లో ధోనీ, గావస్కర్ సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.