ETV Bharat / sports

వర్చువల్​గా క్రీడా పురస్కారాల వేడుక.. పాల్గొన్న రాష్ట్రపతి - క్రీడా దినోత్సవం

భారత అత్యున్నత క్రీడా పురస్కారాలైన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ అవార్డు గ్రహీతలకు అందజేశారు. హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని క్రీడాకారులకు ఈ పురస్కార వేడుక వర్చువల్​గా నిర్వహించారు.

ramnath kovind
రామ్‌నాథ్
author img

By

Published : Aug 29, 2020, 11:54 AM IST

Updated : Aug 29, 2020, 12:03 PM IST

హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం భారత అత్యున్నత క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఈ క్రారక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్.. ప్రతిష్ఠాత్మక అవార్డులైన ఖేల్​రత్న, అర్డునను క్రీడాకారులకు అందించారు. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి విజేతల పేర్లను చదవుతుండగా.. గ్రహీతలు అవార్డులను అందుకున్నారు. దిల్లీ, ముంబయి కోల్‌కతా, చండీగఢ్‌, బెంగళూరు, పుణె, సోనెపట్‌, హైదరాబాద్‌, భోపాల్‌లోని సాయ్‌ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ అత్యున్నత క్రీడా పురస్కారాలను అందుకోవటం పట్ల క్రీడాకారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇది చూడండి క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి - ప్రత్యక్షప్రసారం

Last Updated : Aug 29, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.