Asia Continental Chess : ఆసియా కాంటినెంటల్ చెస్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద, పీవీ నందిద టైటిళ్లు గెలుచుకున్నారు. గురువారం ఓపెన్ విభాగంలో చివరిదైన తొమ్మిదో రౌండ్లో అధిబన్‌తో 63 ఎత్తుల్లో డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద (7 పాయింట్లు) విజేతగా నిలిచాడు. ఈ విజయంతో టైటిల్‌తో పాటు రాబోయే ఫిడే ప్రపంచకప్ బెర్తూ దక్కించుకున్నాడు. మరోవైపు చివరి గేమ్‌ను డ్రా చేసుకున్న తెలుగుతేజం హర్ష భరతకోటి.. అధిబన్‌తో సమానంగా 6.5 పాయింట్లు సాధించాడు. కానీ ఉత్తమ టైబ్రేక్ స్కోరుతో రెండో స్థానంలో నిలిచాడు. అధిబన్ మూడో స్థానం దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో నందిద విజేతగా నిలిచింది. ఆఖరి రౌండ్లో దివ్య దేశ్‌ముఖ్‌తో గేమ్‌ను ఆమె డ్రా చేసుకుంది. దీంతో 7.5 పాయింట్లతో ట్రోఫీ కైవసం చేసుకుంది. తెలుగమ్మాయి నూతక్కి ప్రియాంక రెండో స్థానం సాధించింది. 6.5 పాయింట్లలో దివ్య, కిమ్ వో (వియత్నాం)తో సమానంగా నిలిచినా.. ఉత్తమ టైబ్రేక్ స్కోరు వల్ల ప్రియాంకకు రెండో స్థానం దక్కింది.
ఇవీ చదవండి : T20 World Cup : 6 మ్యచ్‌లు.. 4 బెర్త్‌లు.. తీరని సెమీస్ కష్టాలు
నేను బౌలర్‌తో ఎప్పుడూ ఆడను.. కేవలం బంతితోనే ఆడతా: సూర్యకుమార్