ETV Bharat / sports

పారిస్ ఒలింపిక్స్​లో నా కోచ్ ఆయనే: నీరజ్

author img

By

Published : Oct 9, 2021, 7:51 AM IST

2024లో జరగబోయే పారిస్ ఒలింపిక్స్​లో క్లాస్ బార్టోనియెట్జ్​ తన కోచ్​గా వ్యవహరిస్తారని తెలిపాడు జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా. టోక్యో విశ్వక్రీడల్లోనూ ఈయనే కోచ్​గా ఉన్నారు.

Neeraj Chopra
నీరజ్

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు భారతీయ జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా. శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో రాబోయే పారిస్‌ ఒలింపిక్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మరో మూడేళ్లలో జరగబోయే పారిస్‌ ఒలింపిక్స్‌ 2024కి శిక్షణనంతా డాకర్‌.క్లాస్‌ బార్టోనియెట్జ్ ఆధ్వర్యంలోనే ఉంటుందని స్పష్టం చేశాడు. అందుకు గల ప్రత్యేక కారణాలను ఇలా వివరించాడు.

Neeraj Chopra
డాకర్‌.క్లాస్‌ బార్టోనియెట్జ్

"టోక్యో ఒలింపిక్స్‌కు నాకు క్లాస్‌ బార్టోనియెట్జ్ కోచ్‌గా వ్యవహరించారు. ఆయనతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయనిచ్చే శిక్షణా పద్ధతులు నాకు సూట్‌ అవుతాయి. అందుకే రాబోయే పారిస్ ఒలింపిక్స్‌కు ఆయనే నా కోచ్‌గా కొనసాగుతారు. ఇక మా కోచ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. సీరియస్‌ సెషన్స్‌లో కూడా ఆయన జోక్స్‌ వేస్తుంటారు. నాకు కూడా ట్రైనింగ్‌ సమయంలో సీరియస్‌గా ఉండటం నచ్చదు. సాధారణంగా శిక్షణా సమయంలో కొంత మంది కోచ్‌లు బెత్తం పట్టుకొని కూర్చుంటారు (నవ్వుతూ), కానీ నా గురు అలా కాదు."

-నీరజ్ చోప్రా, జావెలిన్ త్రో క్రీడాకారుడు

ఆరోజు ఏం జరిగిందంటే..

Neeraj Chopra
కోచ్​తో నీరజ్

"టోక్యో ఒలింపిక్స్‌లో తుదిదశ పోరుకి కొద్ది సమయం ఉందనగా.. ఫైనల్‌కు చేరుకున్న చాలా మంది వార్మప్‌ త్రో చేశారు కానీ నేను మాత్రం రెండు మూడు వార్మప్‌తోనే సరిపెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడి వార్మప్‌కే ఉన్న శక్తినంతా కేటాయిస్తే.. అసలాఖరు మ్యాచ్‌కు నీ దగ్గర ఎనర్జీ ఉండదని నా కోచ్ చెప్పారు. ఆయన చెప్పినట్లే పోటీ సమయానికి శక్తిని వృథా చేయకుండా.. ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా ది బెస్ట్ ఇచ్చా. నేను స్వర్ణం సాధించేందుకు ఈ అంశం కూడా బాగా ఉపయోగపడిందనే చెప్పాలి" అని ఒలింపిక్స్‌ రోజున జరిగిన విషయాన్ని పంచుకున్నాడు నీరజ్.

ఇవీ చూడండి: నీరజ్‌ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.