ETV Bharat / sports

కరోనా తగ్గకపోతే టోక్యో ఒలింపిక్స్ కష్టమే!

author img

By

Published : Apr 28, 2020, 3:41 PM IST

ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్.. వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ విషయంపై మాట్లాడారు ఒలింపిక్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో.

Next year's Olympics will be cancelled if pandemic not over: Games chief
వచ్చే ఏడాదికి కరోనా తగ్గకపోతే ఒలింపిక్​ రద్దే!

కరోనా మహమ్మారి వల్ల త్వరలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్.. వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఒకవేళ వైరస్ ప్రభావం అప్పటికి తగ్గకపోయినా, వ్యాక్సిన్ కనిపెట్టకపోయిన పరిస్థితి ఏంటి? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాలపై ఓ వార్త ఏజెన్సీతో మాట్లాడిన ఒలింపిక్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ.. అప్పటికీ కరోనా కట్టడి జరగకపోతే క్రీడల్ని రద్దు చేస్తామని అన్నారు.

గతంలో ప్రపంచ యుద్ధం జరిగినపుడే ఒలింపిక్స్​​ రద్దయినట్లు చెప్పిన మోరీ... మనం కంటికి కనపడని శత్రువుతో ప్రస్తుతం యుద్ధం చేస్తున్నామని అన్నారు. ఒకవేళ వైరస్ పూర్తిగా​ అంతమైపోతే వచ్చే ఏడాది వేసవిలో మెగాక్రీడల్ని కచ్చితంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఇదే విషయంపై స్పందించిన జపాన్​ వైద్య ఆరోగ్య సంస్థ.. కరోనాకు మందు కనిపెట్టకపోతే, ఒలింపిక్స్ నిర్వహించడం కష్టమేనని తేల్చిచెప్పింది.

ఇదీ చూడండి : 'కోహ్లీ, రోహిత్​లను అడ్డుకోవడమే నాకు కీలక సవాల్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.