Korea Open 500 Badminton 2023 : కొరియా ఓపెన్ సూపర్ వరల్డ్ టూర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో.. భారత స్టార్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. పురుషుల డబుల్స్ల్లో చైనీస్ జోడీ.. లియాంగ్ కెంగ్ - వాంగ్ చాంగ్తో నువ్వానేనా అన్నట్టు సాగిన సెకెండ్ సీడెడ్ ఆటలో 21-15, 24-22 తేడాతో గెలుపొందారు.
ఈ సెమీస్ మ్యాచ్‌లో భారత స్టార్ జోడీ.. ప్రపంచ నెం 3తో తలపడింది. మూడో సీడ్లో 9-8గా ఉన్న దశలో బ్యాక్ టూ బ్యాక్ పాయింట్లతో 14 - 8 తో తొలి గేమ్‌లో పైచేయి సాధించింది. అయితే వీరిద్దరూ తొలి రౌండ్‌ను ఈజీగా నెగ్గినప్పటికీ.. రెండో రౌండ్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక దశలో ప్రత్యర్థి జోడీ స్కోర్‌ను సమం చేశారు. దీంతో సాత్విక్ - చిరాగ్ జోడీ మరింత దూకుడుగా ఆడి 40 నిమిషాల్లో ఆటను గెలుపుతో ముగించింది.
-
Another Sunday another Final for Satwik/Chirag✨
— BAI Media (@BAI_Media) July 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We don't mind getting used to this😎
📸: @badmintonphoto#KoreaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/lqzQHepxYF
">Another Sunday another Final for Satwik/Chirag✨
— BAI Media (@BAI_Media) July 22, 2023
We don't mind getting used to this😎
📸: @badmintonphoto#KoreaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/lqzQHepxYFAnother Sunday another Final for Satwik/Chirag✨
— BAI Media (@BAI_Media) July 22, 2023
We don't mind getting used to this😎
📸: @badmintonphoto#KoreaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/lqzQHepxYF
ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000, స్విస్ ఓపెన్ 500 టైటిళ్లు నెగ్గిన సాత్విక్ - చిరాగ్ జోడీ.. ఈ ఏడాది మూడో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అయ్యింది. ఇక ఇండోనేసియా ప్లేయర్లు ఫజర్ - రియాన్, కొరియా ఆటగాళ్లు కాంగ్ మిన్- సియో సంగ్ల మధ్య జరిగే మరో సెమీస్‌లో విజేతతో భారత జోడీ ఫైనల్లో తలపడనుంది.
చైనీస్ జోడీపై తొలిసారి..
ఈ చైనీస్ జోడీపై భారత స్టార్ షట్లర్లు సాత్విక్-చిరాగ్‌లకు ఇదే మొదటి విజయం. ఇది వరకు ఈ ఆటగాళ్లతో ఈ జోడీ రెండు సార్లు తలపడగా రెండింట్లోనూ ఓడింది. ఈ చైనీస్ జోడీ ఇదే సంవత్సరం థాయ్‌లాండ్, ఇండియా ఓపెన్లను కూడా గెలుచుకుంది.
Korea Open 500 PV Sindhu : ఇదే కొరియా ఓపెన్ 2023లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ మొదటి రౌండ్లలో ఓడి ఇంటి బాట పట్టారు. సింధు మహిళల సింగిల్స్‌లో చైనీస్ ప్లేయర్ పాయ్ యుపో చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్.. జపాన్ ఆటగాడు కెంటో మొమోటాతో ఓడాడు. కాగా మొమోటా చేతిలో శ్రీకాంత్ వరుసగా 12 సార్లు ఓటమి చవిచూశాడు.