ETV Bharat / sports

భారత్​ బోణీ.. వెయిట్​ లిఫ్టింగ్​లో రెండు పతకాలు.. గాయంతోనే 248 కేజీలు ఎత్తి! - కామెన్​వెల్త్​ గేమ్స్​ సంకేత్ మహదేవ్‌​ సార్గ

Commonwealth games
భారత్​ బోణీ.. వెయిట్​ లిఫ్టింగ్​లో రజతం
author img

By

Published : Jul 30, 2022, 3:56 PM IST

Updated : Jul 30, 2022, 6:38 PM IST

15:54 July 30

భారత్​ బోణీ.. వెయిట్​ లిఫ్టింగ్​లో రజతం

ఇంగ్లాండ్​లో జరుగుతున్న కామెన్​వెల్త్​ గేమ్స్​లో భారత్​ బోణి కొట్టింది. వెయిట్​లిఫ్టింగ్​లో ఏకంగా రెండు పతకాల్ని సాధించింది. 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్‌​ సార్గర్​ రజత పతకం అందుకోగా.. 61కేజీలో విభాగంలో గురురాజ్​ పూజారి కాంస్య పతకం సాధించాడు.

అయితే ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్‌.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్​ 135 కేజీలు) ఎత్తి.. స్వర్ణానికి కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 135 కేజీలు ఎత్తిన సర్గార్‌.. మిగిలిన రెండు ప్రయత్నాల్లో 139 కేజీలను ఎత్తలేకపోయాడు. ఈ క్రమంలోనే క్లీన్ అండ్ జెర్క్​ రెండో ప్రయత్నంలో అతడి చేతికి గాయమైంది. అందుకే రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక మలేషియాకు చెందిన బిన్‌ మహమద్ అనిఖ్‌.. మహదేవ్ కన్నా ఒకే ఒక్క కేజీ అదనంగా ఎత్తి స్వర్ణ పతకం ఎగరేసుకుపోయాడు. స్నాచ్‌లో 107 కేజీలను మాత్రమే ఎత్తిన అనిఖ్‌.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మాత్రం 142 కేజీలను ఎత్తాడు. దీంతో మొత్తం 249 కేజీల బరువును మోసి గోల్డ్‌ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకకు చెందిన దిలాంక ఇసురు కుమార యోదగె 225 కేజీలతో (స్నాచ్‌ -105, క్లీన్‌ అండ్ జెర్క్‌ - 120) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు.

61కేజీలో విభాగంలో బ్రాంజ్​ మెడల్​ అందుకున్న గురురాజ్​.. మొత్తం 269కిలోల(118kg+151kg బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. ఇతడు 2018 కామన్వెల్త్​ క్రీడల్లో సిల్వర్​ మెడల్​ అందుకున్నాడు. ఇక ఈ విభాగంలో మలేసియాకు చెందిన అజ్నిల్​ బిన్​ బిడిన్ 285కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. మొరియా బారు 273కిలోల బరువు ఎత్తి రజతాన్ని సొంతం చేసుకున్నాడు.

లంకపైనా ఆధిక్యంలో.. బ్యాడ్మింటన్‌లో ఇప్పటికే పాక్‌ను చిత్తు చేసి ఊపు మీదున్న భారత్ గ్రూప్‌-ఏలో లంకపైనా ఆధిక్యం కొనసాగిస్తోంది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్ 3-0 లీడ్‌లోఉంది. ఇక పురుషుల మారథాన్‌ ఫైనల్‌లో భారత్‌ అథ్లెట్‌ రావత్‌ 17 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: శ్రేయస్​ అద్భుత విన్యాసం.. గాల్లోకి ఎగిరి మరీ..

Last Updated : Jul 30, 2022, 6:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.