ETV Bharat / sports

భారత్​ నుంచి మరో గ్రాండ్​ మాస్టర్​.. ఎవరంటే? - ప్రాణేశ్​ చెస్​ కోచ్​ ఆర్​బీ రమేశ్​

భారత్​లో మరో గ్రాండ్​ మాస్టర్​ అవతరించాడు. తమిళనాడుకు చెందిన ఎం. ప్రణేశ్ తాజాగా రిల్టన్ కప్ పోటీలో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో భారత 79వ గ్రాండ్​మాస్టర్​గా నిలిచాడు.

79th Grandmaster Pranesh
భారత 79వ గ్రాండ్​మాస్టర్​గా ప్రణేశ్​!
author img

By

Published : Jan 6, 2023, 6:13 PM IST

కౌస్తవ్ ఛటర్జీ గ్రాండ్ మాస్టర్ అయిన నాలుగు రోజుల వ్యవధిలోనే చదరంగంలో భారత్​ తరఫున మరో ప్లేయర్​ జీఎమ్​ హోదాను దక్కించుకున్నాడు. అంతర్జాతీయ చెస్​ ఫెడరేషన్​(FIDE) సర్క్యూట్​ నిర్వహించిన తొలి టోర్న్​మెంట్​లో రిల్టన్​ కప్​ టైటిల్​ను తమిళనాడుకు చెందిన 16ఏళ్ల ఎమ్​ ప్రణేశ్ ముద్దాడాడు. దీంతో ఈ యంగ్​ ప్లేయర్​ భారత 79వ చెస్​ గ్రాండ్​ మాస్టర్​గా అవతరించాడు. స్వీడెన్​లోని స్టాక్​హౌమ్​ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అతడు 8 మ్యాచులు గెలుపొంది గ్రాండ్​ మాస్టర్​ అర్హతకు కావాల్సిన 2500 ఎలో రేటింగ్​ పాయింట్స్​ను అధిగమించాడు. అంతకుమందు ఈ గ్రాండ్​ మాస్టర్​ అర్హత కోసం మూడు జీఎమ్​ నార్మ్స్​ను కూడా పూర్తి చేశాడు. అలానే ఈ టోర్నీలో ఐఎమ్​ కాన్​ Kucuksari(స్వీడెన్​), జీఎమ్​ సికితా మెష్​కోవ్స్​(లాట్వియా)ను కన్నా ముందుగానే గేమ్స్​ను పూర్తి చేసి పాయింట్లను గెలుచుకున్నాడు. కాగా, జీఎమ్​ కావాలంటే ఓ చెస్‌ ప్లేయర్‌ మూడు జీఎమ్​ నార్మ్‌లను పూర్తి చేయడంతో పాటు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లను సాధించాలి.

ఈ విజయంతో ప్రణేశ్​ ప్రస్తుతం 6.8 సర్క్యూట్ పాయింట్లతో ఎఫ్​ఐడీఈ లిస్ట్​లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సంవత్సరం చివరి నాటికి అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్​ 2024 ఎఫ్​ఐడీఈ అభ్యర్థుల జాబితాకి అర్హత పొందుతారు. ఇక ఇదే టోర్నీలో మరో భారతీయ గ్రాండ్ మాస్టర్​ ఆర్​ రాజా రిత్విక్​ ఆరు పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. కాగా, మొత్తంగా ఈ టోర్నీలో పాల్గొన్న 29 జాతీయ ఫెడరేషన్స్ తరఫున 136 మంది ప్లేయర్స్​ బరిలోకి దిగారు.

ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ట్విట్టర్​ వేదికగా 79వ గ్రాండ్‌మాస్టర్‌ ప్రణేశ్​ను అభినందించింది. "ప్రణేశ్​ చాలా ప్రాక్టికల్ ప్లేయర్, కష్టపడే మనస్తత్వం, గొప్ప ప్రతిభ కలవాడు.. ప్రణేశ్​ ఓపెనింగ్స్ అంత మెరుగ్గా లేకున్నా అతని మిడిల్-గేమ్ ఇంకా ఎండ్-గేమ్ స్కిల్స్ చాలా బాగున్నాయి" అని ప్రణేశ్​ కొచ్ రమేశ్​ కూడా ప్రశంసించారు. ఇక 19 ఏళ్ల కౌస్తవ్ ఛటర్జీ ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ చెస్ ఛాంపియన్‌షిప్​లో గెలిచి భారత 78వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.