భారత బాక్సర్లు తమ ప్రాక్టీస్‌ను తిరిగి ప్రారంభించారు. ఇటలీలోని అస్సిస్సి ఒలింపిక్స్ కేంద్రంలో పురుష బాక్సర్లు తమ శిక్షణ మొదలుపెట్టారు. 52 రోజుల పాటు ఈ శిక్షణా శిబిరం కొనసాగనుంది.
" అధికారుల సూచనల మేరకు భారత్‌కు చెందిన 10 మంది పురుష బాక్సర్లు విదేశాల్లో వారి శిక్షణను ప్రారంభించారు".
-సాయ్ ప్రకటన.
ఈనెల ప్రారంభంలో.. శిక్షణ నిమిత్తం బాక్సర్లను విదేశాలకు పంపిస్తామని స్పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది. 10 మంది పురుష బాక్సర్లు, ఆరుగురు మహిళా బాక్సర్లు, ఇతర సహాయ సిబ్బందితో కలిపి మొత్తం 28 మంది బృందాన్ని ఇటలీ, ఫ్రాన్స్‌లకు పంపిస్తున్నట్లు పేర్కొంది.
ఆ బాక్సర్లు వీరే..
టోక్యో ఒలింపిక్స్‌లో అమిత్ పంగాల్, ఆశిష్ కుమార్, సతీష్ కుమార్, సిమ్రన్ జిత్ కౌర్, లవ్నీనా, పూజా రాణి ఇప్పటికే కోటా సంపాదించారు.
ఇదీ చదవండి:పంజాబ్xహైదరాబాద్: ఫ్లే ఆఫ్స్‌కు చేరాలంటే గెలవాల్సిందే