ETV Bharat / sports

'మీరు ఆడితే లోకమే ఊగదా'.. కేరళను ఊపేస్తున్న సాకర్ ఫీవర్! - కేరళ ఫుట్​బాల్​ ఫ్యాన్స్

FIFA World Cup 2022 : ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ మేనియా కేరళను ఊపేస్తోంది. కేరళలో ఎక్కడ చూసినా రొనాల్డో నిలువెత్తు కటౌట్లు, మెస్సీ ఫ్లెక్సీలు, నెయ్‌మార్‌ బ్యానర్లు, ప్రపంచ కప్‌ ట్రోఫీలు దర్శనమిస్తున్నాయి. అభిమాన ఆటగాళ్ల జెర్సీలు ధరించి మలయాళీలు.. ఫుట్‌బాల్‌పై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. మలప్పురంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

FIFA World Cup 2022
FIFA World Cup 2022
author img

By

Published : Nov 20, 2022, 7:01 PM IST

'మీరు ఆడితే లోకమే ఊగదా'.. కేరళను ఊపేస్తున్న సాకర్ ఫీవర్!

FIFA World Cup 2022 : ఓ వైపు 30 అడుగుల మెస్సీ భారీ కటౌట్లు.. మరోవైపు రొనాల్డో భారీ బ్యానర్లు.. ఇంటికి అభిమాన దేశాల రంగులు.. ఒంటిపై జెర్సీలు.. ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ ప్రారంభంతో.. ఏ అర్జెంటీనాలోనూ.. బ్రెజిల్‌లోనూ ఇలాంటి సందడి నెలకొందని అనుకుంటున్నారా? కాదు.. ఈ హంగామా ప్రారంభమైంది మన దేశంలోనే. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే కేరళ ఫిఫా ప్రపంచకప్‌లో తమ అభిమాన ఆటగాళ్ల మెరుపులు చూసేందుకు సిద్ధమైంది. ఎటుచూసినా సాకర్‌ సందడి కేరళను ఊపేస్తోంది.

FIFA World Cup 2022
ఫుట్​బాల్​ ప్లేయర్ల కటౌట్లు

ఇళ్లకు ఆ దేశాల రంగులు..
కేరళలోని చాలా ప్రాంతాల్లో 2022 ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ సందడే నెలకొంది. అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగల్ దేశాల అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. పతనంతిట్ట జిల్లాలోని మల్లప్పుజస్సేరి గ్రామంలో.. అభిమాన ఆటగాళ్ల జెర్సీలు ధరించడమే కాకుండా ఇళ్లకు అర్జెంటీనా, బ్రెజిల్ రంగులను వేశారు. అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాల అభిమానులు ఈ ఏడాది.. విజయంపై పందేలు కాస్తున్నారు.

FIFA World Cup 2022
ఇళ్లకు అర్జెంటినా, బ్రెజిల్​ దేశాల రంగులు

కోజికోడ్‌లోని పుల్లవూరు గ్రామంలో అర్జెంటీనా.. బ్రెజిల్ అభిమానులు నదిలో మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్‌ జూనియర్‌ భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్లను ట్వీట్‌ చేసిన ఫిఫా.. ఫిఫా ఫీవర్‌ కేరళను తాకిందని పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తుతో తెరను ఏర్పాటు చేసి.. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసేలా ఏర్పాట్లు చేసినట్లు ఫుట్‌బాల్‌ అభిమానులు తెలిపారు.

FIFA World Cup 2022
ఫుట్​బాల్​ ప్లేయర్ల కటౌట్లు

మ్యాచ్​లు చూడడానికి రూ.23 లక్షల ఇల్లు..
కాసరగోడ్‌లో కూడా ఫుట్‌బాల్‌ అభిమానులు మెస్సీ రొనాల్డోల భారీ కటౌట్‌లతో పాటు ఖతార్ పాలకుడు తమీమ్ బిన్ హమద్ అల్ థానీ కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. అర్జెంటీనా, పోర్చుగల్‌ల అభిమానులు తమ అభిమాన జట్ల జెర్సీలను ధరించి సందడి చేశారు. మ్యాచ్‌లను వీక్షించడానికి భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. కొచ్చిలోని ఓ గ్రామంలో 23 లక్షల రూపాయలు వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేసిన అభిమానులు దానికి అభిమాన దేశాల రంగులు వేశారు. ఆ ఇంట్లో భారీ తెరను ఏర్పాటు చేసి మ్యాచ్‌లు వీక్షించే ఏర్పాట్లు చేశారు.

FIFA World Cup 2022
ఫుట్​బాల్​ ప్లేయర్ల కటౌట్లు
FIFA World Cup 2022
కేరళలో ఫిఫా వరల్డ్​కప్​ ఫీవర్

ఇవీ చదవండి : సూర్య సూపర్ సెంచరీ.. కివీస్​తో టీ20 సిరీస్​లో టీమ్ఇండియా బోణీ

BCCI కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ ఎవరు?.. రేసులో ఇద్దరు మాజీలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.