ETV Bharat / sports

Canada Open Badminton 2023 Final : లక్ష్యసేన్‌ గెలిచెన్​.. ఫైనల్లో అదరహో - canada open badminton lakshya sen 2023

Canada Open Badminton 2023 Final : కామన్వెల్త్‌ క్రీడల ఛాంపియన్‌ లక్ష్యసేన్‌ కెనడా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీ ఫైనల్లో విజయం సాధించాడు. ఫైనల్లో చైనా ప్లేయర్ షై ఫెంగ్​ను చిత్తు చేసి జయకేతనం ఎగురవేశాడు.

Canada Open Badminton 2023 Final
కెనడా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్​లో లక్ష్యసేన్‌ గెలుపు
author img

By

Published : Jul 10, 2023, 10:30 AM IST

Updated : Jul 10, 2023, 11:50 AM IST

Canada Open Badminton 2023 Final : కెనడా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్స్​లో లక్ష్యసేన్‌ గెలుపొందాడు. ఫైనల్లో తన ప్రత్యర్థి.. ప్రపంచ పదో ర్యాంకర్‌ చైనా ఆటగాడు షై ఫెంగ్​తో జరిగిన మ్యాచ్​లో రెండు సెట్​లలో 21-18, 22-20 తేడాతో విజయం సాధించి ఛాంపియన్​గా నిలిచాడు. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2022 టోర్నీలో విజయం సాధించిన తర్వాత లక్ష్యసేన్.. బీడబ్ల్యూఎఫ్​ ఛాంపియన్​గా నిలవడం ఇది రెండోసారి.

  • రౌండ్ 32లో థాయ్​లాండ్ ప్లేయర్ ప్రపంచ నాలుగో ర్యాంకర్​ కున్​లావుత్ పై 21-18, 21-15 తేడాతో గెలిచాడు.
  • రౌండ్ 16లో బ్రెజిల్ ప్లేయర్ ఒలివిరాతో పోరాడిన లక్ష్యసేన్​.. 21-15, 21-11తో చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్స్​లో అడుగుపెట్టాడు.
  • ​జర్మన్​ ఆటగాడు కరాగితో క్వార్టర్స్​లో తలపడ్డాడు లక్ష్యసేన్. ఈ మ్యాచ్​తో కెనడా ఓపెన్​ 500లో లక్ష్యసేన్ మొదటిసారి మూడో సెట్​ ఆడాల్సి వచ్చింది. ఫస్ట్ సెట్​​లో లక్ష్య.. తన ప్రత్యర్థి కరాగిపై 21-8 భారీ ఆధిక్యం సాధించాడు. కానీ రెండో సెట్​లో జర్మన్ ప్లేయర్ 21-17తో లక్ష్యసేన్​కు గట్టిపోటీ ఇచ్చాడు. దీంతో ఆట మూడో సెట్​కు దారితీసింది. ఇక మూడో సెట్​లో పుంజుకున్న లక్ష్య.. మళ్లీ ఆధిక్యంలోకి దూసుకొచ్చి 21-10 తో క్వార్టర్స్​లో కరాగిపై విజయం సాధించాడు.
  • సెమీఫైనల్లో జపాన్‌ ఆటగాడు కెంటా నిషిమొటొను 21-17, 21-14తో నాలుగో సీడ్‌లో లక్ష్య చిత్తుచేశాడు. ప్రపంచ 11వ ర్యాంకర్‌ నిషిమొటొను లక్ష్య 44 నిమిషాల్లో మట్టికరిపించాడు. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డట్లు కనిపించిన లక్ష్య.. కొద్దిసేపటికే మళ్లీ ఫామ్​లోకి వచ్చి గెలుపొంది ఫైనల్స్​లోకి దూసుకెళ్లాడు.

కాగా గతేడాది ఆగస్ట్​లో ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ తర్వాత లక్ష్యసేన్ ముక్కుకు సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ నుంచి లక్ష్య కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అతడు చివరిసారిగా 2022లో బర్మింగమ్​లో జరిగిన కామన్వెల్త్​ గేమ్స్​లో పాల్గొన్నాడు.​

మరోవైపు ఉమెన్స్​ సింగిల్స్​లో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సెమీస్​లో ఓడింది. సెమీస్‌లో నాలుగో సీడ్‌ సింధు జపాన్ ప్లేయర్, ప్రపంచ నంబర్‌వన్‌ అకానె యమగూచితో..14-21, 15-21తో పరాజయం చవిచూసింది. 43 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించిన యమగూచి.. తన గెలుపోటముల రికార్డులో సింధు ఆధిక్యాన్ని 11-14కు తగ్గించింది.

Last Updated : Jul 10, 2023, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.