ETV Bharat / sports

జాతీయ క్రీడా అవార్డులు ఏంటి? ఎలా ఎంపిక చేస్తారు?

ఆగస్టు 29 అంటే నేడు.. భారత హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ పుట్టినరోజు. ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. క్రీడల్లో భారత ఆటగాళ్లు చూపిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు ఇస్తుంది. ఆ అవార్డులు ఎన్ని రకాలు ఉంటాయి? వాటి కోసం ఎలా ఎంపిక చేస్తారు?

జాతీయ క్రీడా అవార్డులు ఏంటి? ఎలా ఎంపిక చేస్తారు?
జాతీయ క్రీడా అవార్డులు
author img

By

Published : Aug 29, 2020, 5:30 AM IST

భారత్​లో ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. భారత హాకీ దిగ్గజం ధ్యాన్​​ చంద్​ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఈ వేడుకను జరుపుకుంటాం. 1905లో ఉత్తరప్రదేశ్​లోని అలహాబాద్​లో పుట్టిన ఆయన.. ఒలింపిక్స్​లో భారత్​కు మూడు బంగారు పతకాలు (1928, 1932, 1936) తెచ్చాడు. 22 ఏళ్ల కెరీర్​లో 400 గోల్స్​ సాధించాడు. ధ్యాన్​చంద్​ క్రీడారంగంలో చేసిన కృషికి గుర్తుగా ఈ రోజున క్రీడాకారులకు అవార్డులు అందజేస్తారు. క్రీడల్లో దేశానికి పేరు తెచ్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేస్తారు.

NATIONAL SPORTS DAY AWARDS-2020 list
జాతీయ క్రీడా పురస్కారాలు-2020 జాబితా

1. ఖేల్​ రత్న

క్రీడారంగంలో అత్యున్నత భారతీయ పురస్కారం రాజీవ్​గాంధీ ఖేల్ రత్న. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ఈ అవార్డును ఇవ్వడం ప్రారంభించారు. ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ క్రీడలు వంటి పలు అంతర్జాతీయ టోర్నీల్లో.. నాలుగేళ్ల కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు వ్యక్తిగత, బృంద విభాగంలో ఈ అవార్డు అందజేస్తారు. పురస్కారంతో పాటు మెడల్, ప్రశంసాపత్రం, రూ. 7.5 లక్షల నగదు బహుకరిస్తారు. చెస్ గ్రాండ్‌ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మొదటి అవార్డు స్వీకరించాడు.

khel ratna award
ఖేల్​రత్న పురస్కారం

2. అర్జున అవార్డు

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించడానికి యువజన, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1961 నుంచి అర్జున అవార్డు ప్రదానం చేస్తోంది. పురస్కార గ్రహీతలను అర్జునుడి కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ. 5 లక్షల నగదుతో సత్కరిస్తారు. నాలుగేళ్ల కాలంలో క్రీడల్లో ప్రతిభ చూపించడమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు కలిగిని వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

arjuna award
అర్జున అవార్డు

3. ద్రోణాచార్య అవార్డు

అంతర్జాతీయ స్థాయిలో పతక విజేతలను తయారుచేసిన ఉత్తమ క్రీడా శిక్షకులకు ఈ అవార్డు ఇస్తారు. 1985 నుంచి ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేస్తున్నారు. విజేతలకు ద్రోణాచార్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ.7 లక్షల నగదును బహుకరిస్తారు. ప్రతి ఏటా ఈ అవార్డు అందజేస్తారు.

drona charya award
ద్రోణాచార్య అవార్డు

4. ధ్యాన్​చంద్​ అవార్డు

ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల కోసం ఆటగాళ్లకు శిక్షణనిస్తూ వారికి తోడ్పాటు అందించిన క్రీడాకారులకు.. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఆటలను ప్రోత్సహించే కోచ్​లకు ఈ అవార్డు అందిస్తున్నారు. విజేతలకు ప్రశంసాపత్రంతో పాటు రూ.5 లక్షల నగదు బహుమతిగా ఇస్తారు. వీటితో పాటు మరికొన్ని అవార్డులను క్రీడాకారులకు రాష్ట్రపతి అందజేస్తారు.

dhyan chand award
ధ్యాన్​చంద్​ అవార్డు

జాతీయ క్రీడా అవార్డులు

టెన్జింగ్​ నార్గే జాతీయ సాహస అవార్డు:

సాహస క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఇందులో నాలుగు విభాగాలుంటాయి. నేల, నీరు, గాలి, జీవిత సాఫల్య విభాగాల్లో ఈ అవార్డు ప్రదానం చేస్తారు. విజేతలకు రూ.5 లక్షల నగదు బహుమతి, ఉత్సవ దుస్తులు, ఒక ప్రశంస పత్రం ఇస్తారు.

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం

ఈ అవార్డు క్రీడాకారులకు, శిక్షకులకు కాకుండా క్రీడల్లో ఇతర పాత్రలు పోషించిన వారికి ఇస్తారు. ఆటలను ప్రోత్సహిస్తోన్న సంస్థలు, వ్యక్తులు, క్రీడా బోర్డులు, ఎన్జీఓలకు ఈ ట్రోఫీలు ఇస్తారు. ఇందులో నాలుగు విభాగాలుంటాయి.

  • యువ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి వారికి తోడ్పాటు అందించడం
  • సామాజిక సేవలో భాగంగా సంస్థలు.. క్రీడలకు ప్రోత్సాహమివ్వడం
  • క్రీడాకారులకు ఉపాధి, సంక్షేమ చర్యలు
  • ఆటల కోసం ప్రతిభ అకాడమీల స్థాపన, నిర్వహణ

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ

ఈ ట్రోఫీని 1956-57 నుంచి భారత క్రీడా మంత్రిత్వశాఖ ఇస్తోంది. ఇంటర్ యూనివర్సిటీ, జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఆల్​రౌండ్​ ప్రదర్శన చూపిన సంస్థలకు దీన్ని ప్రదానం చేస్తారు. విజేతలకు ట్రోఫీతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.

జాతీయ క్రీడాదినోత్సవాన్నే రాష్ట్రీయ ఖేల్​ దివస్​గానూ పిలుస్తారు. ఈరోజున దేశవ్యాప్తంగా క్రీడల ప్రాధాన్యం, వాటి ముఖ్య పాత్ర గురించి అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.